BigTV English

Mehar Ramesh : సీజ‌న్ మార్చిన మెహ‌ర్ ర‌మేష్ స‌క్సెస్ ద‌క్కేనా!

Mehar Ramesh : సీజ‌న్ మార్చిన మెహ‌ర్ ర‌మేష్ స‌క్సెస్ ద‌క్కేనా!
 Meher Ramesh


Mehar Ramesh : ఇండ‌స్ట్రీలో మంచి ప‌రిచ‌యాల‌తో స్టార్ హీరోలతో వ‌రుస సినిమాలు చేసిన ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్‌. తొలి సినిమా కంత్రి. ఎన్టీఆర్‌తో చేశాడు. స‌మ్మ‌ర్ సంద‌ర్భంగా మే 9, 2008లో ఈ చిత్రం రిలీజైంది. అయితే సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. త‌ర్వాత మెహ‌ర్ ర‌మేష్ చేసిన చిత్రం బిల్లా. ప్ర‌భాస్ హీరోగా న‌టించారు. ఇది కూడా స‌మ్మ‌ర్ సంద‌ర్భంగా ఏప్రిల్ 3, 2009లో విడుద‌లైంది. ఈ సినిమా కూడా నిరాశ ప‌రిచింది. ఇక మెహ‌ర్ ర‌మేష్ చేసిన మూడో సినిమా శ‌క్తి. ఇందులో జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టించాడు. ఇది కూడా స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో వ‌చ్చింది. ఏప్రిల్ 1, 2011లో రిలీజైంది. భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో రిలీజైన ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది.

ఇక మెహ‌ర్ ర‌మేష్ చేసిన నాలుగో సినిమా షాడో. ఇందులో వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టించాడు. ఇది కూడా 2013 వేసవి సంద‌ర్భంగా ఏప్రిల్ 26న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇది కూడా నిరాశ ప‌రిచింది. దీంతో మెహ‌ర్‌కు అవ‌కాశాలు రాలేదు. ఎట్ట‌కేల‌కు ప‌దేళ్ల త‌ర్వాత మెహ‌ర్ ఐదో సినిమా రానుంది. అదే భోళా శంక‌ర్‌. మెగాస్టార్ చిరంజీవి హీరో. అయితే పై నాలుగు సినిమాల‌కు మెహ‌ర్ ఫాలో అయిన స‌మ్మ‌ర్ సీజ‌న్ రిలీజ్ సెంటిమెంట్‌ను చిరంజీవితో చేస్తోన్న్ భోళా శంక‌ర్‌కి ఫాలో కావ‌టం లేదు. ఎందుక‌నో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆగ‌స్ట్ 11న రిలీజ్ కానుంది. అంటే నాన్ స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో భోళా శంక‌ర్ మూవీ రానుంది.


అంటే ఇప్ప‌టి వ‌ర‌కు స‌మ్మ‌ర్ సీజ‌న్‌నే మెహ‌ర్ ర‌మేష్ టార్గెట్ చేసి త‌న సినిమాల‌ను రిలీజ్ చేసిన‌ప్ప‌టికీ స‌క్సెస్ రాలేదు. అయితే ఈసారి త‌న ప్లానింగ్ చేసి భోళా శంక‌ర్‌ను నాన్ స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో రిలీజ్ చేస్తున్నారు. మ‌రి ఈసారైనా మెహ‌ర్‌కి స‌క్సెస్ ద‌క్కేనేమో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×