Big Stories

Daam: ఫోన్లు ‘దామ్‌’.. డేంజరస్ వైరస్.. కేంద్రం వార్నింగ్..

daam virus

Daam: కంప్యూటర్లు హ్యాక్ చేసే రోజులు పోయాయ్. ఇప్పడంతా మొబైల్‌లోనే పని కానిచ్చేస్తున్నారు. అందుకే, సెల్‌ఫోన్లను హ్యాక్ చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు కేటుగాళ్లు. ముందు వైరస్‌ను మొబైల్‌లో జొప్పిస్తారు. అ తర్వాత సైలెంట్‌గా మొత్తం డేటాను, హిస్టరీని కొట్టేస్తారు. ఇంకేం.. ఒక్కసారి మన ఇన్ఫర్మేషన్ వాళ్ల చేతికి గానీ చిక్కిందా.. ఇక మన పని ఫసక్.

- Advertisement -

ఐఫోన్లో ఇలాంటి వైరసులు గట్రా కుదరవు. అందుకే, ఆండ్రాయిడ్ ఫోన్లపైనే ఫోకస్ పెట్టారు. లెటేస్ట్‌గా ‘దామ్’ అనే వైరస్ ఇండియాన్స్ మొబైల్ ఫోన్స్‌ను అటాక్ చేస్తోంది. ‘దామ్’ మాల్‌వేర్‌తో జర జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్రమే హెచ్చరిస్తోందంటే అదెంత డేంజరో తెలుస్తోంది.

- Advertisement -

మొబైల్‌కు రకరకాల పేర్లతో ఓ స్పామ్ లింక్ వస్తుంది. పొరపాటున ఆ లింక్ క్లిక్ చేశారో ఇక అంతే సంగతి. దామ్ వైరస్ ఫోన్లో ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఇక మొత్తం ఊడ్చేస్తుంది. కాల్‌ డేటా, కాంటాక్ట్ డీటైల్స్, హిస్టరీ, కెమెరా, ఫైల్స్, ఫోటోస్.. ఏది దొరికితే అది. వదిలిపెట్టకుండా హ్యాక్ చేసేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌ ప్రాసెస్‌ను నిలిపేస్తుంది.

ఫోన్లో సెక్యూరిటీ ఆప్స్ ఉన్నాయని.. మాకేం కాదని బిందాస్‌గా ఉండొద్దంటోంది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ది ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌. మొబైల్‌లోని సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లను బోల్తా కొట్టించి, రాన్‌సమ్‌వేర్‌ను డెవలప్‌ చేసుకునే సత్తా ‘దామ్’ మాల్‌వేర్‌కు ఉందని హెచ్చరిస్తోంది. మొబైల్‌లోని డేటా మొత్తం కొట్టేశాక.. దానిని ‘.enc’ ఫార్మాట్‌ ఎన్‌క్రిప్ట్‌ చేసుకొని, ఒరిజినల్‌ డేటాను డిలీట్‌ చేస్తుంది ఈ మాల్‌వేర్.

మరెలా? ‘దామ్’ నుంచి రక్షించుకోవడం ఎలా? అంటే, ఒక్కసారి వైరస్ ఎంటర్ అయితే ఇక చేసేదేమీ ఉండదు. అందుకే, ముందే జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద లింకులపై క్లిక్‌ చేయొద్దు. అనుమానాస్పద మెసేజ్‌లు వస్తే రెస్పాండ్ కావొద్దు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News