Big Stories

Artificial intelligence : ఏఐ సామర్థ్యంతో అందమైన విగ్రహం తయారీ..

Artificial intelligence : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) అనేది ఎన్ని విధాలుగా ప్రపంచాన్ని శాసిస్తుంది అని చెప్పడం కష్టంగా మారిపోయింది. ప్రతీ రంగంలో ఏఐ ఉంది. మనిషి చేసే ప్రతీ పని ఏఐ కూడా చేయగలుగుతోంది. అందుకే ఏఐతో మరెన్నో అద్భుతాలు సృష్టించాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఏఐ సామర్థ్యంతో ప్రపంచంలోనే మొదటి విగ్రహం తయారయ్యింది. ప్రస్తుతం ఇది ప్రదర్శన కోసం మ్యూజియంలో ఉండగా.. ప్రజలు చూడడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

- Advertisement -

స్టాక్‌హోల్మ్‌లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏఐ సామర్థ్యంతో తయారైన విగ్రహం ఏర్పాటయ్యింది. దీనికి ‘ది ఇంపాజిబుల్ స్టాట్యూ’ అని పేరు కూడా పెట్టారు. ఇది ఒక మనిషి గోల్డెన్ గ్లోబ్‌ను పట్టుకొని నిలబడినట్టుగా ఉంటుంది. మామూలు మనుషులకు ఇది ఒక అందమైన ఆర్ట్‌గా మాత్రమే కనిపిస్తుంది. కానీ టెక్నాలజీపై అవగాహన ఉన్నవారికి ఇందులోని అసలైన అందం తెలుస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ విగ్రహం మిషిలాంగెలో, రాడిన్ వంటి విగ్రహాల విధంగా ఉంటుందని చూసిన పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ది ఇంపాజిబుల్ స్టాట్యూ అనేది అయిదు ఆర్ట్స్‌ను ఏఐ గమనించి, అందులో నుండి నేర్చుకున్న ప్రోగ్రామ్స్ ద్వారా తయారు చేయబడింది. ఈ విగ్రహంలోని మెటల్ వర్క్ చూసిన వారిని ఆకర్షిస్తోంది. ముందుగా దీనిని 2డి ఇమేజ్‌లో తయారు చేసి ఆపై 3డి మోడల్‌లో దీనిలోని మార్పులు చేర్పులు చేసి విగ్రహంగా మార్చారు. ఈ విగ్రహం 1.5 మీటర్ హైట్‌లో ఉండి, 500 కిలోల బరువుతో ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది చూసిన వారందరూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనేది ఆర్ట్‌ను అందంగా తయారు చేసిందని తెలిపారు.

ప్రస్తుతం స్టాక్‌హోల్మ్‌లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ది ఇంపాజిబుల్ స్టాట్యూ అనేది ప్రత్యేకంగా విజిటర్స్ చూడడం కోసం గ్యాలరీలో ఏర్పాటు చేయబడిందని శాస్త్రవేత్తలు అన్నారు. ఇది మ్యూజియంకు వచ్చే విజిటర్స్‌ను ప్రత్యేకంగా ఆకర్షిస్తుందని తెలిపారు. ఈ విగ్రహం స్ఫూర్తితో ఇలాంటి మరెన్నో మాస్టర్‌పీస్ విగ్రహాలను ఏఐ సాయంతో తయారు చేయించాలని పలు ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News