BigTV English

Algal Photosynthesis : నాచే కదాని లైట్ తీసుకోవద్దు. వాతావరణాన్ని రక్షించే నేస్తం ఇది

Algal Photosynthesis : నాచే కదాని లైట్ తీసుకోవద్దు. వాతావరణాన్ని రక్షించే నేస్తం ఇది

Algal Photosynthesis : నాచే కదాని లైట్ తీసుకోవద్దు. వాతావరణాన్ని రక్షించే నేస్తం ఇదిఎప్పుడైనా నీటిలోపల ఉండే బండరాళ్లను గమనించారా? ఆకుపచ్చరంగులో ఉంటాయి. వాటిపై కాలు పడితే సర్రున జారిపోతుంది. దీనికి కారణమేంటో తెలుసా! నాచు. దాన్నే ఆల్గే అంటాం. ఆకుపచ్చని రంగులో ఉండే నాచు… నీటిలోని బండరాళ్లపై, నీటిపైన, తేమగా ఉండే చోట్లలోనూ ఉంటుంది. దీన్ని తక్కువగా అంచనా వేస్తుంటాం. పనికిరానిదిగా భావిస్తుంటాం. నాచు గురించి తెలియకపోవడమే దీనికి కారణం. ఆల్గేకు చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. వాతావరణాన్ని పరిరక్షించే నేస్తం ఈ ఆల్గే. మొక్కలు, చెట్లు కిరణజన్య సంయోగ క్రియ జరుపుకుంటాయనే విషయం తెలిసిందే. వీటిలాగే సముద్రాలు, నదులు, చెరువులు, సరస్సుల్లో జీవించే నాచు కూడా కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటుందని సైంటిస్టులు వెల్లడించారు. నీటిని, కార్బన్ డై ఆక్సైడ్ ని ఉపయోగించుకుని సూర్యరశ్మి సహాయంతో క్లోరోఫిల్ గ్లూకోజ్ లేదా కార్బోహైడ్రేట్లను తయారు చేసే ప్రక్రియనే కిరణజన్య సంయోగ క్రియ అంటాం. ఇందులో మొక్కలు నీటిలోని ఆక్సిజన్ ని వేరు చేసి వాతావరణంలోకి విడుదల చేస్తాయి. ఇక ఆల్గేలు కూడా ఇలాంటి ప్రక్రియనే అనుసరిస్తాయి. నత్రజని, ఫాస్పేట్, కార్బన్ డయాక్సైడ్ లను సంగ్రహించి సూర్యకాంతి సమక్షంలో కిరణజన్య సంయోగ క్రియను జరుపుకుంటాయి. ఈ ప్రక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుంది. మన వాతావరణంలోని ఆక్సిజన్ లో దాదాపు 70 శాతం ఆల్గే నుంచే లభిస్తుందంటే ఆశ్చర్యమే కదా! ఆల్గే వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ ని ఉపయోగించుకుని ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది. అలా వాతావరణ పరిరక్షణకు దోహదపడుతుంది. గ్రీన్ హౌజ్ వాయువుల మోతానుదు తగ్గించి, భూతాపం పెరగకుండా చూస్తుంది. అంతేకాదు వ్యవసాయ, ఆహార వ్యర్థాల వంటి వాటి నుంచి జీవ ఇంధనాలు తయారు చేయడానికి ఆల్గేను ఉపయోగిస్తారు. దీని వల్ల కూడా భూతాపం తగ్గుతుంది. ఆల్గే అనేది సాధారణంగా ఏడు రకాలుగా ఉంటుంది. గ్రీన్ ఆల్గే, యూగ్లినాయిడ్స్, డయాటామ్స్, ఫైర్ ఆల్గే, ఎల్లో గ్రీన్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే వంటివి ఉంటాయి. వీటిలో డయాటామ్స్ చాలా ప్రత్యేకమైనవని చెప్పాలి. గోల్డెన్ బ్రౌన్ రంగులో ఉండే ఈ నాచుకు సిలికాతో కూడిన అస్థి పంజరం ఉంటుంది. ఇక డయాటామ్స్ లో 20 లక్షలకుపైగా వేర్వేరు జాతులున్నాయి. భూ వాతావరణంలోని ఆక్సిజన్ లో 20 నుంచి 30 శాతం డయాటామ్స్ ద్వారానే వస్తుండడం విశేషం.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×