BigTV English
Advertisement

TATA Airlines : ఎయిరిండియాలో టాటా విమానయాన సంస్థల విలీనం..

TATA Airlines : ఎయిరిండియాలో టాటా విమానయాన సంస్థల విలీనం..

TATA Airlines : టాటాల ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని విమానయాన సంస్థలు ఇకపై ఎయిరిండియాలో విలీనం కాబోతున్నాయి. టాటా సన్స్ ఆ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని సమాచారం. తీవ్ర నష్టాల్లో ఉన్న ఎయిరిండియాను ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన టాటా గ్రూప్‌… దాని పునరుద్ధరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.


ప్రస్తుతం సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి విస్తారా పేరుతో విమానయాన సంస్థను నడుపుతున్న టాటా సన్స్. ఈ బ్రాండ్‌ను ఇప్పుడు పూర్తిగా రద్దు చేసుకునే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. విస్తారాను ఎయిరిండియాలో విలీనం చేస్తే… అందులో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు ఇవ్వాల్సిన వాటాపై చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. అయితే దీనిపై టాటా నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ మాత్రం… టాటాలతో ఉన్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్చలు కొనసాగుతున్నాయని ఇటీవల ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో పేర్కొంది. విస్తారాతో పాటు ఎయిరేషియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను కూడా… ఎయిరిండియాలోనే కలపి పెద్ద సంస్థగా మార్చాలన్నది టాటాల ప్రణాళికగా చెబుతున్నారు.

ఏడాది కిందట రూ.18 వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను కొనుగోలు చేసింది… టాటా. దాన్ని పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా ఇటీవలే 300 న్యారో-బాడీ విమానాలకు ఆర్డర్‌ ఇచ్చింది. వాణిజ్య విమానయాన చరిత్రలోని అతిపెద్ద లావాదేవీల్లో ఇదొకటి. వచ్చే ఐదేళ్లలో కంపెనీ విమానాల సంఖ్యను మూడింతలకు పెంచాలనేది ఎయిరిండియా ఆలోచన. 25 ఎయిర్‌బస్‌ విమానాలతో పాటు ఐదు బోయింగ్‌ పెద్ద విమానాలను కూడా కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది… ఎయిరిండియా. దీని కోసం ఒక బిలియన్‌ డాలర్ల నిధుల్ని సమీకరించేందుకు ప్రయత్నిస్తోంది… కంపెనీ.


1932లో టాటాల ఆధ్వర్యంలో దేశంలో విమానయానం మొదలైంది. 21 ఏళ్ల తర్వాత ఆ సంస్థ భారత ప్రభుత్వం చేతుల్లోకి వచ్చింది. 1953లో ఎయిరిండియాను జాతీయం చేసిన తర్వాత… దాదాపు 40 ఏళ్ల పాటు ఏవియేషన్‌ రంగాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలింది… ఎయిరిండియా. కానీ 1994లో ఏవియేషన్‌ రంగంలోకి ప్రైవేట్ కంపెనీలు ప్రవేశించడంతో… ఎయిరిండియాకు కష్టాలు మొదలై నష్టాల్లో కూరుకుపోయింది. 2000 సంవత్సరంలోనే ఎయిరిండియాలో మెజార్టీ వాటా లేదా 40 శాతమైనా అమ్మేందుకు అప్పటి ప్రభుత్వం సిద్ధపడింది. దీనికి టాటాతో పాటు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ఆసక్తి చూపాయి. కానీ ట్రేడ్‌ యూనియన్లు ప్రైవేటైజేషన్‌ను వ్యతిరేకించడంతో వెనుకడుగు వేశాయి. 20 ఏళ్ల తర్వాత.. 2020 జనవరిలో మరోసారి ఎయిరిండియా ప్రైవేటైజేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. 20 నెలల తర్వాత టాటాల చేతికొచ్చింది.

Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×