BigTV English

Jeff Bezos: అమెజాన్ అధినేత పొదుపు పాఠాలు

Jeff Bezos: అమెజాన్ అధినేత పొదుపు పాఠాలు

Jeff Bezos:ఆర్థికమాంద్యం భయాలతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌… తాను పొదుపు పాటించడమే కాదు… ప్రజలు డబ్బు దాచుకోవాలని సూచిస్తున్నాడు. ఇకపై ఏదైనా కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని, ఆచితూచి వ్యవహరించాలని బెజోస్ జనాన్ని కోరాడు. ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందని, దాన్ని ఎదుర్కోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలని బెజోస్ చెప్పాడు. హాలిడే సీజన్‌లో అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలని, డబ్బు పొదుపు చేసుకోవాలని జాగ్రత్తలు చెప్పాడు.


పెద్ద టీవీ కానీ, ఫ్రిజ్ లేదా కారు కొనాలనే ఆలోచన ఉంటే… కొన్నాళ్లు వాయిదా వేయాలని జెఫ్ బెజోస్ సలహా ఇచ్చాడు. డబ్బును దగ్గరే ఉంచుకుని.. రిస్క్‌కు దూరంగా ఉండాలని సూచించాడు. వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడి పెట్టాలనుకునే చిన్న వ్యాపారవేత్తలు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని… నగదు నిల్వలు పెంచుకోవాలనేది బెజోస్ చెబుతున్న మాట. అంతా మంచే జరగాలని కోరుకుందాం… అలాగే కష్టకాలానికి కూడా సిద్ధంగా ఉందామని అందరికీ సూచించాడు… బెజోస్.

మరోవైపు.. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టిన అమెజాన్… వచ్చే ఏడాదిలోనూ కోతలు ఉంటాయని ప్రకటించింది. ఇప్పటి వరకు కంపెనీ తీసుకున్న నిర్ణయాల్లో ఇదే అత్యంత కఠినమైనదని ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నాడు… సంస్థ సీఈఓ ఆండీ జస్సీ. ఖర్చు ఎక్కడెక్కడ తగ్గించాలనే దానిపై ఏడాది పాటు సమీక్ష జరిపామని… కొన్ని విభాగాల్లో ఉద్యోగుల్ని తొలగిస్తున్నామని… కొన్నేళ్లుగా చేపట్టిన భారీ నియామకాల వల్లే కఠిన నిర్ణయం తప్పలేదన్నాడు… అమెజాన్ సీఈఓ. అయితే, ఎంత మందిని తొలగించాలనేది ఇంకా నిర్ణయించలేదని… రివ్యూ జరిగే కొద్దీ ఉద్యోగుల్ని తీసేస్తూ వెళ్తామని ఆయన చెప్పారు. వినియోగదారుల సేవలకు అత్యంత అవసరమైన విభాగాల్లోనూ, దీర్ఘకాలంలో కంపెనీ భవిష్యత్తుకు ఉపయోగపడే విభాగాల్లో మాత్రమే ఇకపై అమెజాన్ ఉద్యోగులు ఉంటారని జస్సీ చెప్పారు. మరోవైపు… 260 మంది కార్పొరేట్ సిబ్బందిని తొలగిస్తూ తొలి ప్రకటన జారీ చేసింది.. అమెజాన్.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×