Big Stories

Carbon Capture:కార్బన్ డయాక్సైడ్‌ను బంధించడానికి కొత్త మార్గం..

Carbon Capture:గ్లోబల్ వార్మింగ్ అనేది ఎప్పటినుండో సీరియస్ సమస్యగా ఉంది. రోజురోజుకూ ఇది మరింత సీరియస్‌గా మారుతోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలతో కలిసి ఈ సమస్యను దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముందుగా గ్లోబల్ వార్మింగ్ పూర్తిగా నివారించడం కంటే దానిని అదుపులో తీసుకురావడం సులభమని వారు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అమెరికా కూడా ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమయ్యింది.

- Advertisement -

గ్లోబల్ వార్మింగ్ అనేది ఏర్పడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ అందులో ముఖ్యమైనది గాలి కాలుష్యం ఎక్కువగా ఉండడం. పరిశ్రమలు, కెమికల్ ఫ్యాక్టరీల సంఖ్య ఎక్కువవడంతో గాలిలో కాలుష్యం మోతాదుకు మించి ఉంది. దీనికి తోడుగా ఇతర కాలుష్యాలు కూడా పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. దీని కారణంగానే వాతావరణంలో మార్పులు ఏర్పడడంతో పాటు ఎన్నో అంతుచిక్కని ఆరోగ్య సమస్యలు కూడా మానవాళిని ఇబ్బంది పెడుతున్నాయి.

- Advertisement -

గాలిలో ఆక్సిజన్‌కు మించి కార్బన్ డయాక్సైడ్ శాతం ఎక్కువవ్వడం కూడా గ్లోబల్ వార్మింగ్‌కు కారణమే. అందుకే ఈ కార్బన్ ఉద్గారాలు గాలిలోకి వెళ్లకుండా బంధించే విధంగా కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కార్బన్ డయాక్సైడ్‌ను బంధించడానికి అతి తక్కువ ఖర్చుతో ఒక కొత్త సిస్టమ్‌ను కనిపెట్టారు. ఇప్పటివరకు దీనికోసం ఎన్నో టెక్నాలజీలు తయారయ్యాయి. కానీ వాటన్నింటికంటే తక్కువ కరెంట్‌తో, నీటితో ఈ కొత్త టెక్నాలజీ తయారు కానుంది.

ప్రస్తుతం కార్బన్ డయాక్సైడ్‌ను బంధించి అది భూమిలోపల బంధించడానికి టెక్నాలజీలు ఉన్నాయి. కానీ ఈ కొత్త టెక్నాలజీ అలా కాదు. ఇది కార్బన్ డయాక్సైడ్‌ను బంధించి మెథనాల్‌గా మారుస్తుంది. మెథనాల్ అనేది ఎన్నోరకాలుగా ఉపయోగపడే కెమికల్. అయితే ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో తయారయ్యి మార్కెట్లోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. ఎంతైనా ప్రస్తుత పరిస్థితుల్లో కాలుష్యాన్ని అదుపు చేయడం కష్టమే అని వారు వాపోతున్నారు.

Cyber Crimes in IT:ఐటీలో సైబర్ నేరాలకు అదే కారణం..!

Russia Ukraine war:ఇండియాకు లాభం తెచ్చిపెట్టిన రష్యా, ఉక్రెయిన్ వార్..

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News