Asia Cup 2025 : ఆసియా కప్ 2025 టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య సూపర్ 4 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో బంగ్లాదేశ్ ఫైనల్ కి వెళ్తానన్న ఆశలు గల్లంతయ్యాయి. మరోవైపు ఇవాళ బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాట్స్ మెన్ అభిషేక్ శర్మ 75 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. అయితే అభిషేక్ శర్మ రనౌట్ కావడంతో స్టేడియంలో ఏడ్చేసింది. ఇటీవల పాకిస్తాన్ మ్యాచ్ సందర్బంగా ఆమె ఓపెనర్ అభిషేక్ వర్మకి ప్రపోజ్ చేసిన విషయం తెలిసిందే.
Also Read : Team India : వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక..వైస్ కెప్టెన్ గా జడేజా..షెడ్యూల్ ఇదే
ఇండియా నుంచి మ్యాచ్ చూసేందుకుదుబాయ్ కి వెళ్లిన సుజిత అనే యువతి.. మ్యాచ్ జరుగుతుండగానే లవ్ అభిషేక్ శర్మ అంటూ అరిచింది. ఇక అంతేకాదు.. ఫ్లైయింగ్ కిస్ లు కూడా పెట్టింది.మరోవైపు పాకిస్తాన్ తో మ్యాచ్ జరుగుతున్న సమయంలోఏ అభిషేక్ శర్మను గట్టిగా పిలుస్తే.. ఐ లవ్ యూ అంటూ పేర్కొంది. అయితే ఆ లేడీ ఎంత అరిచినప్పటికీ అభిషేక్ శర్మ మాత్రం అస్సలు పట్టించుకోలేదు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా అభిషేక్ శర్మ రనౌట్ కాగానే.. ఏడ్చింది సుజిత. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 168-6 పరుగులు చేసింది.
Also Read : Asia Cup 2025 : టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై విమర్శలు…గంభీర్ పై సంజూ సీరియస్?
టీమిండియా క్రికెటర్లలో 37 బంతుల్లో 75 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ శుబ్ మన్ గిల్ 19 బంతుల్లో 29 పరుగులు చేశాడు. శివమ్ దూబే 3 బంతుల్లో 2 పరగులు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 11 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి ఔట్ గా వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యా 38, తిలక్ వర్మ 5 అక్షర్ పటేల్ 10 పరుగులు చేసి నాటౌట్ గా ఉండనుంది. బంగ్లా బౌలర్లలో రిషద్ హొస్సెయిన్, సైఫుద్దీన్ 1, ముస్తాఫిజర్ 1, హాసన్ షకీబ్ 1 చొప్పున వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఓపెనర్ సైఫ్ హాసన్ 69, జహోసన్ ఎమాన్ 21 మినహా మిగతా ఆటగాళ్లు ఎవ్వరూ కూడా రెండు అంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, బుమ్రా 2, వరుణ్ చక్రవర్తి 2, అక్సర్ పటేల్ 1, తిలక్ వర్మ 1 వికెట్ చొప్పున తీసుకున్నారు. దీంతో బంగ్లాదేశ్ జట్టు 19.3 ఓవర్లలో 127 పరుగుకేఆలౌట్ అయింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు 41 పరుగుల తేడాతో టీమిండియా పై ఓటమి పాలైంది. దీంతో టీమిండియా ఆసియా కప్ 2025లో నేరుగా ఫైనల్ కి చేరుకుంది. ఆ తరువాత ఇవాళ బంగ్లాదేశ్- పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు టీమిండియాతో ఈనెల 28న ఫైనల్ లో తలపడనుంది.
?igsh=OTFnNWZ2OWZ2Nmdu