BigTV English

6G Network:5G పూర్తిగా రాలేదు.. అప్పుడే 6G ప్రయత్నాలు..

6G Network:5G పూర్తిగా రాలేదు.. అప్పుడే 6G ప్రయత్నాలు..

6G Network:మన దేశంలో ప్రధాన నగరాలతో పాటు కొన్ని జిల్లాల్లో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చినా… ఇంకా పూర్తిగా విస్తరించలేదు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది చివరినాటికి 5G సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి… టెలికాం కంపెనీలు. మన దగ్గర 5G సర్వీసులు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే… ఇతర దేశాల్లో 6G నెట్‌వర్క్‌పై ప్రయత్నాలు జరుగుతున్నాయి.


దక్షిణ కొరియా ప్రభుత్వం అప్పుడే 6G నెట్‌వర్క్‌పై కసరత్తు ముమ్మరం చేసింది. అనుకున్న దానికంటే రెండేళ్లు ముందుగానే 6G సర్వీసులు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని… దక్షిణ కొరియా సైన్స్‌, ఐసీటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 6G నెట్‌వర్క్ పేటెంట్ పోటీలో… పేటెంట్ల సంఖ్యను 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెంచే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది. 5G పేటెంట్ల సంఖ్యలో దక్షిణ కొరియా శాతం 25.9 కాగా, 26.8 శాతంతో చైనా మార్కెట్ లీడర్‌గా ఉంది. అందుకే 6G పేటెంట్ల సంఖ్యలో చైనాను అధిగమించాలని దక్షిణకొరియా గట్టి పట్టుదలతో ఉంది.

2028 కల్లా ప్రపంచంలోనే తొలి 6G నెట్‌వర్క్‌ను ప్రారంభించాలని భావిస్తోంది… దక్షిణ కొరియా. వైర్‌లెస్‌ రంగంలో తన ఆధిపత్యాన్ని చాటుకునేలా, కే-నెట్‌వర్క్ 2030 ప్రణాళికలో భాగంగా… నెక్ట్స్‌ జెనరేషన్ నెట్‌వర్క్ ప్రయత్నాలను వచ్చే రెండేళ్లలో మరింత ముమ్మరం చేయనుంది. ప్రపంచస్థాయి 6G టెక్నాలజీ ద్వారా… సురక్షితమైన మొబైల్‌ నెట్‌వర్క్‌ను ఆవిష్కరించాలని భావిస్తోంది… దక్షిణ కొరియా. కౌంటీ నెట్‌వర్క్ సరఫరా గొలుసును బలోపేతం చేయాలనే ప్రణాళికలో భాగంగా తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. 481.7 బిలియన్‌ డాలర్ల వ్యయంతో… కోర్ 6G సాంకేతికతలపై పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుపుతోంది. అంతేకాదు… తదుపరి తరం మొబైల్ నెట్‌వర్క్ టెక్నాలజీ ఉత్పత్తులు తయారు చేసేలా తమ దేశ కంపెనీలను ప్రోత్సహించాలని భావిస్తోంది. మొబైల్‌కు అనుకూలంగా ఉండే ఓపెన్ ర్యాన్ లేదా ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి… స్థానిక కంపెనీలను కూడా ప్రోత్సహించనుంది.


OnePlus:వన్‌ ప్లస్‌ 11R 5G.. ప్రీ-ఆర్డర్‌ చేశారా?

Hyundai:’వెర్నా’ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయిందిగా!

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×