BigTV English

OG Movie OTT: ఓజీ ఓటీటీ అప్డేట్.. ఎన్ని వారాల్లో వస్తుందంటే ?

OG Movie OTT: ఓజీ ఓటీటీ అప్డేట్.. ఎన్ని వారాల్లో వస్తుందంటే ?

OG Movie OTT : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ఓజీ(OG). సుజిత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులు గత మూడు సంవత్సరాల పాటు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఇలా అభిమానుల నిరీక్షణకు నేటితో తెర పడిందని చెప్పాలి. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు సినిమా పట్ల అభిమానులు ఎన్నో అంచనాలను ఉన్నప్పటికీ ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా కాకపోయినా పరవాలేదు అనిపించుకుంది. ఇక ఈ సినిమా కోసం అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు క్యూ కడుతున్నారు.


ఓజీ హక్కులను కైవసం చేసుకున్న నెట్ ఫ్లిక్స్..

ఈ సినిమా భారీ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక స్క్రీన్ లలో ప్రసారం అవుతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ఓటీటీకి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. సాధారణంగా ఒక సినిమా విడుదలకు ముందే ఓటీటీ సమస్థతో భాగస్వామ్యం కుదుర్చుకొని ఆ సినిమా హక్కులను సదరు సంస్థకు భారీ ధరలకు విక్రయిస్తూ ఉంటారు. అయితే ఈ సినిమా థియేటర్లో విడుదలైన నాలుగు వారాల వ్యవధిలోనే తిరిగి ఓటీటీలో ప్రసారం అయ్యేవిధంగా డీల్ కుదుర్చుకొని ఉంటారు. తాజాగా ఓజీ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ
ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్(Net Flix) వారు భారీ ధరలకు కొనుగోలు చేశారని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా థియేటర్లో విడుదలైన 6 నుంచి 8 వారాల వ్యవధిలో డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతోందని సమాచారం.

నవంబర్ నెలలో డిజిటల్ స్ట్రీమింగ్?

ఓజీ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా నవంబర్ చివరివారం లేదా డిసెంబర్లో నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి రాబోతోదని తెలుస్తుంది. అయితే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన తెలియజేసే వరకు వేచి ఉండాల్సిందే. ఇక పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సన్నివేశాలలో పవన్ కళ్యాణ్ తన అద్భుతమైన నటనను కనబరిచారు.


ప్రేక్షకుల అంచనాలను చేరుకుందా?

ఇలా ఈ సినిమాలో పలు యాక్షన్ సన్ని వేషాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఇంతకు మించి ఉంటుందని ప్రతి ఒక్క అభిమాని భావించారు కానీ ఫుల్ మీల్స్ అనుకున్న అభిమానులకు ప్లేట్ మీల్స్ తోనే దర్శకుడు సుజీత్ సరిపెట్టారు. ఇకపోతే ఈ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు ఉన్న నేపథ్యంలోనే అడ్వాన్స్ బుకింగ్ కూడా అదే స్థాయిలో జరిగాయి. మొదటి రోజు సుమారు 100 కోట్లకు పైగా ఓపెనింగ్ రాబడతాయని అంచనాలు వేస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా ప్రియాంక ఆరుళ్ మోహన్ నటించి సందడి చేశారు.

Also Read:OG Movie: ఓజీ షోలో విషాదం…ప్రమాదంలో ఇద్దరు పవన్ ఫ్యాన్స్

Related News

OTT Movie : కిరీటం కోసం కొట్లాట… వేల ఏళ్ల పాటు వెంటాడే శాపం… మతిపోగోట్టే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మహిళల్ని బలిచ్చి దిష్టి బొమ్మలుగా… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ సామీ

OTT Movie : జాబ్ ఇస్తామని చెప్పి దిక్కుమాలిన ట్రాప్… అలాంటి అమ్మాయిలే ఈ ముఠా టార్గెట్… క్రేజీ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఇంటర్వ్యూకు వచ్చిన 8 మంది ఒకే గదిలో… అమ్మాయి బట్టలు విప్పుతూ… సింగిల్ గా చూడాల్సిన మూవీ మావా

OTT Movie : అమ్మాయిని కిడ్నాప్ చేసి 7 రోజులు అదే పాడు పని… వీళ్ళు మనుషులా మానవ మృగాలా ? ఈ మూవీ పెద్దలకు మాత్రమే

OTT Movie : అడుగు పెట్టగానే కుప్పకూలే కలల సౌధం… చివరి వరకూ ట్విస్టులే… బుర్ర బ్లాస్ట్ చేసే కొరియన్ థ్రిల్లర్

OTT Movie : 40 ఏళ్ల క్రితం మిస్సైన అమ్మాయి కోసం వేట… టాటూతో ఊహించని ట్విస్ట్… పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

Big Stories

×