భారతదేశంలో ఎన్నో అద్భుతమైన దీవులు ఉన్నాయి. వాటి గురించి చాలా మందికి తెలియక విదేశాలకు వెళ్తున్నారు. థాయ్ లాండ్, మాల్దీవ్స్, ఇండోనేషియా లాంటి దేశాలకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ, సహజమైన బీచ్‌లు, పగడపు దిబ్బలు, అద్భుతమైన వృక్షసంపద, విభిన్న సంస్కృతుల మిశ్రమంతో కూడిని పలు ద్వీపాలు ఉన్నాయి. స్వర్గాన్ని తలపించే 10 రహస్య దీవుల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
స్నార్కెలింగ్, డైవింగ్‌కు అనువైన నీటి కొలనుతలో కూడిన ప్రశాంతమైన పగడపు ద్వీపం ఇది. కద్మత్ లో కనువిందు చేసే నీళ్లు, కొబ్బరి చెట్లతో కూడిన బీచ్‌లు, ప్రర్యాటకులకు ఎంతో ప్రశాంతతను అందిస్తాయి.
బంగారం ఐలాండ్ లో ఎలాంటి జనావాసాలు ఉండవు. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. స్పష్టమైన నీటి కొలనులు. మృదువైన ఇసుకతో కప్పబడి ఉంటుంది. ఏకాంతంగా నక్షత్రాలను చూడటానికి, బీచ్ వెంబడి నడవడానికి, ప్రశాంతమైన అనుభూతిని పొందడానికి బెస్ట్ ఆప్షన్ ఇది.
చంద్రవంక లాంటి సరస్సు, లైట్ హౌస్ తో కూడిన ప్రత్యేకమైన మినికాయ్ ద్వీపం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎటు చూసినా సముద్ర జీవులు, రంగురంగుల పడవలు, బలమైన స్థానిక సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తుంది.
తిన్నకర అనేది అగట్టి సమీపంలోని ఒక ప్రదేశం. ఇది ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అద్భుతమైన బీచ్‌లు, పగడపు దిబ్బలతో కూడి ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు ఇది సరైన ప్రదేశం.
మున్రో అనేది కేరళ బ్యాక్ వాటర్ ఉంటుంది. ఇది ఓ గ్రామీణ ప్రాంతం. కొబ్బరి తోటలు, కాలువలు, సాంప్రదాయ జీవనంతో నిండిన చిన్న ద్వీపాల సమూహాన్ని కలిగి ఉంది.
మజులి ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం. బ్రహ్మపుత్ర నది వెంబడి విస్తరించి ఉంటుంది. ఇది ఆధ్యాత్మికత, ప్రకృతి మధ్య సమతుల్యతను ఏర్పరుస్తుంది.
మాండోవి నదికి అవతలి వైపున ఉన్న దివార్, పోర్చుగీస్ కాలం నాటి ఇళ్ళు, వరి పొలాలు, ఇరుకైన దారులను కలిగి ఉంటుంది. ఇవి గోవా బీచ్ లకు ప్రశాంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి.
జనావాసాలు లేని, హృదయ ఆకారంలో ఉన్న నేత్రానికి పర్యాటకులు డైవ్, స్నార్కెల్ చేయడానికి వెళ్తారు. పగడపు తోటలు, సముద్ర జీవులతో నిండిన స్పష్టమైన నీరు ఉన్నాయి.
సెయింట్ మేరీస్ ప్రపంచంలో మరెక్కడా కనిపించని బసాల్ట్ రాక్ లక్షణాలను కలిగి ఉన్న ద్వీపం. ప్రశాంతమైన బీచ్‌లను, అద్భుతమైన తీరప్రాంత ప్రకృతి దృశ్యాలను అందిస్తుంది.
జామ్ నగర్ లోని మెరైన్ పార్క్ లలో ఒకటిగా ఉంది. ఇక్కడ మడ అడవులు, టైడల్ ఫ్లాట్‌లను కలిగి ఉండటంతో ఇది అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి వెళ్లాలంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
Read Also: దసరా పండుగ వచ్చేస్తోంది, వీలుంటే కచ్చితంగా ఈ ప్లేసెస్ కు వెళ్లండి!