The Language of Birds : ఉదయాన్నే పక్షుల గొంతు వినాడనికి ఎంత మనశ్శాంతిగా ఉంటుంది కదా.. ఇప్పటికీ పల్లెటూళ్లలో చాలామంది కోడికూతతోనే నిద్ర లేస్తారు కదా.. ఇలా చాలావరకు జీవాలు, పక్షులు.. మనుషులతో ఏదో విధంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఒకవేళ ఆ జీవాలు అన్నింటికి కామన్‌గా ఒక భాష ఉండుంటే ఎలా ఉంటుంది. ఆలోచనే చాలా వెరైటీగా ఉంది కదా.. అదే ఆలోచన శాస్త్రవేత్తలకు కూడా వచ్చింది. అందుకే జంతువుల భాషను కనిపెట్టడానికి వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
పక్షులు పాట పాడుతాయని అంటుంటాం, కానీ ఆ పాట ఏ భాష అని అనుమానం ఎవరికైనా వచ్చిందా..? అదే అనుమానం 39 ఏళ్ల టోషిటాకా సుజుకీకు కూడా వచ్చింది. ఈ విషయాన్ని స్టడీ చేయడం కోసమే సుజుకీ అడవులలోనే జీవించడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా పక్షుల పాటల గురించి పరిశోధనలు మొదలుపెట్టాడు. వారి పాటల్లో ఉండే తేడాలు కనిపెట్టాడు. పక్షులు అనేవి మొత్తం మానవాళిని ఆకర్షించే విధంగా పాటలు పాడుతాయని తన పరిశోధనల్లో తేలింది.
తన పరశోధనల సమయంలో తల్లి పక్షి పాట పాడితే.. తన పిల్లలు గూడు నుండి బయటికి రావడాన్ని గమనించాడు. మామూలు మనుషులకు ఈ పక్షి పాడింది మామూలు పాటలాగానే అనిపించినా.. తన పిల్లలకు మాత్రం ఇది ఒక పిలుపు లాగా అర్థమయ్యింది. అది ఎలా సాధ్యమయ్యింది అని అన్న సందేహంతో కొత్త పరిశోధనలను మొదలుపెట్టాడు. కేవలం పిలుపు కోసమే కాదు.. పిల్లలను హెచ్చరించడం కోసం పక్షి ఒక కొత్త స్వరంతో పాడడం మొదలుపెట్టడాన్ని తను గమనించాడు.
పక్షుల ఎమోషన్‌కు తగినట్టుగా వారి స్వరం ఉంటుందని, దానికి తగినట్టుగా వారి పాట మారుతుందని సుజుకీ నిర్ధారించాడు. యానిమల్ లాంగ్వేజ్ పేరుతో తన పరిశోధనలు మొదలయ్యాయి. ఆ తర్వాత సుజుకీ డాగ్ లాంగ్వేజ్, హార్స్ లాంగ్వేజ్‌లో ప్రావీణ్యం పొందాడు. మనుషులు.. పక్షులు, ఇతర జీవరాశుల కంటే గొప్ప అని అనుకోవడం ఎప్పుడు మానేస్తాడో.. అప్పుడు వారికి యానిమల్ లాంగ్వేజ్ అర్థమవుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈరోజుల్లో చాలామంది పర్యావరణవేత్తలు యానిమల్ లాంగ్వేజ్‌ను నమ్ముతారు, దానిని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.