BigTV English

Hyderabad: సుజాత-రాజేశ్.. ప్రేమా? అక్రమ సంబంధమా? హత్యా? ట్విస్టుల మీద ట్విస్టులు..

Hyderabad: సుజాత-రాజేశ్.. ప్రేమా? అక్రమ సంబంధమా? హత్యా? ట్విస్టుల మీద ట్విస్టులు..
sujatha rajesh

Hyderabad crime news telugu(Telangana today news): సుజాత. ప్రభుత్వ టీచర్. గత వారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. కట్ చేస్తే, ఆమె పాయిజన్ తీసుకున్న రోజే.. వాళ్ల ఇంటి సమీపంలోనే రాజేశ్ అనే యువకుడి హత్య జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.


సుజాత ఆత్మహత్యకు.. రాజేశ్ హత్యకు లింక్ ఉందంటున్నారు పోలీసులు. చాలాకాలంగా వాళ్లిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని గుర్తించారు. ఓ రాంగ్ డయల్ వాళ్లిద్దరినీ కలిపింది. ఆ తర్వాత వారిని ప్రేమలో పడేసింది. అప్పటికే పెళ్లై.. దాదాపు రాజేశ్ అంత వయస్సున్నంత పిల్లలున్న సుజాత.. ఆ విషయాన్ని దాచిపెట్టింది. రాజేశ్ అమాయకంగా ఆమె ప్రేమలో మునిగిపోయాడు. కొన్నినెలలుగా రహస్యంగా కలుస్తున్నారు. ఆ తర్వాత అతనికి సుజాత పెళ్లి, పిల్లల విషయం తెలిసింది. అప్పటి నుంచి దూరం పెట్టాడు. నువ్వు లేకపోతే నేనుండనంటూ.. చనిపోతానంటూ రాజేశ్ కు వాట్సాప్ మెసేజ్ పెట్టింది. నువ్ చనిపోతే నేనూ చనిపోతానంటూ రాజేశ్ నుంచి రిప్లై. అంతలోనే సుజాత పురుగుల మందు తాగేసింది. ఇదంతా ఓ వెర్షన్.

సుజాత భర్త నాగేశ్వరరావు ఇంకో స్టోరీ చెబుతున్నాడు. తన భార్య అమాయకురాలని.. రాజేశ్ కొంతకాలంగా ఆమెను ఫోన్లో వేధిస్తున్నాడని అంటున్నాడు. తాను ఓసారి అతన్ని మందలించానని.. అయినా తీరు మార్చుకోలేదని అంటున్నారు. అసలు తన భార్యకు రాజేశే బలవంతంగా విషం తాగించి చంపేశాడని.. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. రాజేశ్ ఎలా చనిపోయాడో తనకు తెలీదంటున్నాడు. ఇది అతని వెర్షన్.


సుజాత, రాజేశ్‌ల అక్రమ సంబంధం ఆమె ఇంట్లో వాళ్లకి తెలిసింది. ఓసారి రాజేశ్‌కు సుజాత భర్త వార్నింగ్ ఇచ్చాడు. ఇటీవల తమ ఇంటి దగ్గర తిరుగుతుంటే.. రాజేశ్‌ను పట్టుకుని బెదిరించాడు సుజాత కొడుకు. తన తల్లి జోలికి వస్తే బాగుండదంటూ.. అతను తన స్నేహితులతో కలిసి రాజేశ్‌ను కొట్టాడు. రాజేశ్‌ను కొట్టిన నాలుగు రోజుల తర్వాత ఆ సమీపంలోనే కుళ్లిన స్థితిలో అతని డెడ్‌బాడీ దొరకడం మరో ట్విస్ట్. అయితే, తాను కానీ, తన కొడుకు కానీ రాజేశ్‌ను కొట్టలేదని.. అంటున్నాడు సుజాత భర్త నాగేశ్వరరావు.

ఇలా మూడు వెర్షన్లు వినిపిస్తున్నాయి ఈ కేసులో. ఎలాంటి క్రైమ్ స్టోరీనైనా 24 గంటల్లో నిగ్గు తేల్చే హైదరాబాద్‌ పోలీసులకు ఈ కేసు మాత్రం ఛాలెంజింగ్‌గా మారింది. ఇంతకీ సుజాతది ఆత్మహత్యా? హత్యా? రాజేశ్ ఎలా చనిపోయాడు? ఎవరు చంపేశారు? సుజాత భర్తే హంతకుడా? సుజాత కొడుకే చంపేశాడా? సుజాత, రాజేశ్‌ల అక్రమ సంబంధంలో విలన్ ఎవరు? ఖాకీలనే కన్ఫ్యూజ్ చేస్తోంది ఈ కేసు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×