BigTV English

Anand Mahindra: ట్రాఫిక్ సిగ్నల్స్‌లేని రోడ్డు.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

Anand Mahindra: ట్రాఫిక్ సిగ్నల్స్‌లేని రోడ్డు.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

Anand Mahindra: ఉదయం ఆఫీస్‌కు వెళ్దామని బైకు తీయగానే మొదలవుతుంది.. అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న జనాలకు.. ఒక్కసారిగా చిరాకు తెప్పిస్తుంది. అదే ట్రాఫిక్. ఇక నగరాల్లో అయితే చెప్పనక్కర్లేదు. కొద్ది దూరం వెళ్లాలన్నా ట్రాఫిక్‌లో గంటల గంటల సమయం పడుతుంది. మరీ ఎక్కువగా ఉదయం ఆఫీస్‌లకు వెళ్లే సమయంలో.. తిరగి ఇళ్లకు చేరుకునే సమయంలో మరింత దారుణంగా ఉంటుంది.


ఇక వీటికి తోడు ట్రాఫిక్ సిగ్నల్స్. కొద్ది దూరానికే ఓ ట్రాఫిక్ సిగ్నల్. సరిగ్గా మనం వెళ్లే సమయానికి సిగ్నల్ పడుతుంది. అక్కడ మరింత టైమ్ వేస్ట్. అయితే అసలు ట్రాఫిక్ సిగ్నల్స్‌ఏ లేని రహదారులు ఉంటే ఎలా ఉంటుంది?. సగం ట్రాఫిక్ సమస్య తీరిపోతుంది.

తాజాగా ట్రాఫిక్ సిగ్నల్స్‌లోని రోడ్డు డిజైన్‌కు సంబంధించిన వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా డిజైన్ చేసిన ఆ మార్గాల్లో వాహనాలు ఎక్కడా ఆగకుండా వెళ్తూ ఉండడం మనం వీడియోలో చూడొచ్చు.


‘‘అద్భుతం. యెమెన్ ఇంజనీర్ ముహమ్మద్ ఆవాస్ రూపొందించిన డిజైన్. ఇది ‘హాఫ్ రౌండ్-అబౌట్స్‌’లను ఉపయోగించి ట్రాఫిక్ లైట్లు లేకుండా ట్రాఫిక్‌ను నిరంతరం నియంత్రిస్తుంది. కానీ, ఈ విధానంలో ఎక్కువ ఇంధనం అవసరమవుతుందా?’’ అంటా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు మన దగ్గర కూడా ఇటువంటి రోడ్లు వస్తే ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టవచ్చిన కామెంట్లు పెడుతున్నారు.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×