BigTV English

Apple Watch: యాపిల్‌ వాచ్‌ను తలదన్నే వాచ్‌.. ధర తెలిస్తే ఎగబడి కొనాల్సిందే!

Apple Watch: యాపిల్‌ వాచ్‌ను తలదన్నే వాచ్‌.. ధర తెలిస్తే ఎగబడి కొనాల్సిందే!

Apple Watch:యాపిల్‌ ప్రొడక్ట్స్‌ ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అది స్మార్ట్‌ ఫోన్ అయినా.. వాచ్‌ అయినా.. దాని క్వాలిటీ, ఫెసిలిటీస్‌ అన్నీ టాప్‌లెవల్‌ ఉంటాయి. ధర కూడా వాటికి తగ్గట్లే ఉంటుంది.  ఆపిల్ వాచ్ కూడా ఆ కోవలోనిదే. ఆపిల్‌ వాచ్ సిరీస్‌లో అత్యంత ఖరీదైన మోడల్‌ యాపిల్ వాచ్ అల్ట్రా(Apple Watch Ultra). దీని ధర మన దేశంలో దాదాపు రూ.90 వేలు. అంత ఖరీదైన వాచ్‌ కొనడం బాగా డబ్బున్నోళ్లకే సాధ్యం. అయితే.. అచ్చుగుద్దినట్లు యాపిల్ అల్ట్రా మోడల్‌నే పోలిన వాచ్‌ కేవలం రూ.2500 కే దొరుకుతుందంటే నమ్మగలరా..? నమ్మాల్సిందే. స్మార్ట్‌ వాచ్‌ తయారీలో టాప్‌ కంపెనీగా పేరు పొందిన ఫైర్‌ బోల్ట్ (Fire Boltt) దీన్ని త్వరలోనే విడుదల చేయబోతోంది. అధికారికంగా ధరను డిసెంబర్‌30నే ప్రకటించనుంది.
ఫైర్‌ బోల్డ్ గ్లాడియేటర్‌ (Fire Boltt Gladiator) పేరుతో వస్తున్న ఈ మోడల్‌ను డిసెంబర్‌ 30న రిలీజ్ చేయబోతున్నారు.  బ్లూ టూత్‌ కాలింగ్ ఫెసిలిటీ ఉన్న ఈ వాచ్‌ డిస్‌ ప్లే 1.96 అంగుళాలు. యాపిల్ వాచ్ అల్ట్రా కన్నా డిస్‌ప్లే పెద్దదన్నమాట. 600 NITS బ్రైట్‌నెస్‌, సన్నని ఫ్రేమ్ డిజైన్‌ దీన్ని యాపిల్ వాచ్‌లానే కనిపించేలా చేస్తోంది. ఇక ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 7 రోజుల బ్యాటరీ లైఫ్‌ కూడా ఉంది. బ్లూ టూత్‌ కాలింగ్ ఫెసిలిటీని వాడుకుంటే రెండు రోజుల పాటు చార్జింగ్ వస్తుందని కంపెనీ చెబుతోంది. స్టాండ్‌బైలో అయితే ఏకంగా 20 రోజుల పాటు పనిచేస్తుంది.
ఇక ఫిట్‌నెస్‌ ఫ్రీక్స్‌కు కోరుకునే ఫీచర్లన్నీ ఇందులో ఉన్నాయి. ఏకంగా 123 స్పోర్ట్స్ మోడ్స్‌ను అందిస్తున్నారు. రన్నింగ్‌, కేలరీ బర్నింగ్, హార్ట్‌బీట్‌, ఆక్సిజన్‌ మానిటరింగ్‌, ఉమెన్ హెల్త్ ట్రాకింగ్‌ లాంటి ఫీచర్లు ఎన్నో. దీనికి జీపీఎస్‌ ట్రాకింగ్‌ కూడా ఉంది. ఇయర్‌ ఫోన్స్ అవసరం లేకుండా వాచ్‌ ద్వారానే కాల్‌ ఆన్సర్ చేయొచ్చు. అంతేకాదు బోర్‌ కొడితే ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి.


Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×