Bobby Deol: బాబీ డియోల్(Bobby Deol) ఇటీవల కాలంలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఏమాత్రం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఒకానొక సమయంలో హీరోగా ఎన్నో సినిమాలలో నటించిన ఈయన కొన్ని కారణాలవల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలలో కూడా అవకాశం అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమాలో ఛాన్స్ అందుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాబీ డియోల్ ఔరంగజేబు (Aurangazeb) పాత్రలో కనిపించి సందడి చేశారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
బాబి డియోల్ మొదటి ఎంపిక కాదా?
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో నిర్మాత ఏ.ఏం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ (Jyothi Krishna)ఈ సినిమాకు దర్శకత్వపు బాధ్యతలు తీసుకున్నారు. కొన్ని కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది ముఖ్యంగా నటుడు బాబి డియోల్ ఔరంగజేబు పాత్రలో నటించడంతో ముందుగా ఈ పాత్రలో నటించడానికి బాబి డియోల్ ను తీసుకోలేదని తెలుస్తుంది. ఈయన స్థానంలో మరో నటుడు ఈ సినిమా షూటింగ్స్ లో కూడా పాల్గొన్నారని సమాచారం.
ఔరంగజేబుగా అర్జున్ రాంపాల్…
ఇలా కొన్ని రోజులు షూటింగ్ తర్వాత బాబీ డియోల్ ఈ సినిమాలో భాగమయ్యారని తెలుస్తోంది. మరి బాబి డియోల్ కంటే ముందుగా ఈ సినిమాలో ఔరంగాజేబు పాత్రలో నటించిన ఆ నటుడు ఎవరు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ముందుగా ఔరంగజేబు పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్(Arjun Rampal) ను చిత్ర బృందం సంప్రదించినట్టు తెలుస్తుంది. ఔరంగజేబు పాత్రకు ఎంపికైన అర్జున్ రాంపాల్ కొన్ని రోజులపాటు ఈ సినిమా షూటింగ్స్ లో కూడా పాల్గొన్నారని తెలుస్తుంది.
షూటింగ్ ఆలస్యమే కారణమా…
ఇకపోతే ఈ సినిమా పవన్ కళ్యాణ్ కారణంగా అలాగే కరోనా కారణం వల్ల ఆలస్యం అవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలోనే ఆయనకు ఇతర కమిట్మెంట్స్ కారణంగానే ఈ సినిమా నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. ఈ విధంగా అర్జున్ రాంపాల్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో తిరిగి ఔరంగాజేబు పాత్ర కోసం బాలీవుడ్ నటుడు బాబీడియోల్ ను మేకర్స్ సంప్రదించడం జరిగిందని తెలుస్తుంది. యానిమల్ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బాబి డియోల్ ఇటీవల వరుస సౌత్ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్నారు. ఇకపోతే అర్జున్ రాంపాల్ సైతం ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
Also Read: Mission impossible OTT:ఓటీటీలోకి రాబోతున్న మిషన్ ఇంపాజిబుల్.. ఎప్పుడు? ఎక్కడంటే?