OTT Movie : ఒక గ్రిప్పింగ్ కోర్ట్‌రూమ్ డ్రామా, సస్పెన్స్, ఎమోషనల్ కథలు ఇష్టపడేవాళ్లకు, రీసెంట్ గా ఒక తమిళ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చింది. ఈ సిరీస్ న్యాయవ్యవస్థలోని లోపాలతో, ఒక సామాన్యుడు చేసే పోరాటాన్ని హైలైట్ చేస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
జీ 5 లో స్ట్రీమింగ్
‘Sattamum Needhiyum’ 2025లో విడుదలైన తమిళ కోర్ట్‌రూమ్ డ్రామా వెబ్ సిరీస్. దీన్ని బాలాజీ సెల్వరాజ్ డైరెక్ట్ చేశారు. ససికల ప్రభాకరన్ 18 క్రియేటర్స్ బ్యానర్‌లో నిర్మించిన ఈ సిరీస్‌లో సరవణన్, నమ్రితా ఎమ్‌వీ, అరౌల్ డి. శంకర్, షణ్ముగం, తిరుసెల్వం, విజయశ్రీ, ఇనియా రామ్ నటించారు. ఈ సిరీస్ 2025 జులై 18 నుంచి ZEE5లో ప్రీమియర్ అయింది. ఇందులో మొత్తం 7 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ 22-25 నిమిషాల నిడివి కలిగి ఉంది. ఇది న్యాయవ్యవస్థలో అధికారం, అవినీతి, నీతి గురించి చెప్పే ఎమోషనల్, సస్పెన్స్‌ఫుల్ కథ. IMDbలో ఈ సిరీస్ కి 8.0/10 రేటింగ్ ఉంది.
స్టోరీ
సుందరమూర్తి ఒక నోటరీ పబ్లిక్. గతంలోని చేదు అనుభవాల కారణంగా కోర్టు కేసులకు దూరంగా ఉంటాడు. అతను కోర్టు పరిసరాల్లో చిన్నపాటి పనులు చేసుకుంటూ, సాధారణ జీవితం గడుపుతుంటాడు. అతని కొడుకు, కూతురు అతన్ని వృత్తిపరంగా విజయవంతం కాలేదని, అసమర్థుడని అవమానిస్తుంటారు. ఇది అతనికి మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఒక రోజు కుప్పుస్వామి అనే వ్యక్తి తన కూతురు వెన్నిలా అదృశ్యం కావడంతో న్యాయం కోసం కోర్టు ముందు తనను తాను తగలబెట్టుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ ఘటన సుందరమూర్తిని తీవ్రంగా కదిలిస్తుంది. అతను ఈ కేసును తీసుకుని, పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL) ఫైల్ చేస్తాడు. ఈ కేసులో అరుణ అనే ఉత్సాహవంతమైన లా గ్రాడ్యుయేట్ అతనికి సహాయం చేస్తుంది. ఆమె నిజాన్ని బయటకు తీసుకురావాలనే పట్టుదలతో ఉంటుంది.
వీళ్ళు కేసును విచారిస్తున్నప్పుడు, వెన్నిలా అదృశ్యం వెనుక ఉన్న రహస్యాలు బయటపడతాయి. ఈ కేసు అంత సులభంగా ముందుకు కదలదు. ఒక పవర్‌ఫుల్ ప్రాసిక్యూటర్‌తో, రాజకీయ ఒత్తిళ్లతో, సిస్టమ్‌లోని అవినీతితో పోరాడాల్సి వస్తుంది. కేసు ముందుకు సాగుతున్నప్పుడు, వెన్నిలా 20 సంవత్సరాల క్రితం అదృశ్యమైనట్టు తెలుస్తుంది. కానీ ఆమె తండ్రి ఇప్పుడే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే ప్రశ్నలు తలెత్తుతాయి. సుందరమూర్తి ఈ ఒత్తిడి అధిగమించి, న్యాయం కోసం పోరాడుతాడు. క్లైమాక్స్‌లో వెన్నిలా కోర్టులో కనిపించి, తన తండ్రి త్యాగాన్ని గౌరవిస్తూ అసలు నిజాన్ని బయటపెడుతుంది. ఇది ఒక ఎమోషనల్, సస్పెన్స్‌ఫుల్ ముగింపును ఇస్తుంది. అసలు వెన్నిలా కోర్టులో చెప్పే నిజాలు ఏమిటి ? ఆమె తండ్రి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ? వెన్నిలా 20 సంవత్సరాల క్రితం ఎలా మిస్సింగ్ అయింది ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : ఫ్రెండ్ భార్యపైనే కన్ను… ఆపుకోలేక అడ్డమైన పనులు… పార్ట్స్ ప్యాక్ అయ్యే క్లైమాక్స్