Mission impossible OTT:ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కేవలం ఇండియన్ సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషా సినిమాలను,వెబ్ సిరీస్ లను చూసే వెసలు బాటు కలిగింది. ఇలా ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లు నిత్యం ఓటీటీలో విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. అయితే తాజాగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ సినిమా కూడా ఓటీటీలోకి రావడానికి సిద్ధమవుతోంది. హాలీవుడ్(Holly Wood) ఇండస్ట్రీలో తెరకెక్కి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలలో “మిషన్ ఇంపాజిబుల్” (Mission impossible)ఒకటి. హాలీవుడ్ ఫ్రాంచైజీస్ లో మిషన్ ఇంపాజిబుల్ సినిమాకు ప్రత్యేకమైన స్థానం మాత్రమే కాకుండా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉందని చెప్పాలి.
టామ్ క్రూజ్ అద్భుతమైన సాహసాలు…
ఇటీవల ఈ సిరీస్లో 8వ భాగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన” మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్” బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ సిరీస్ లో టామ్ క్రూజ్ (Tom Cruise) చేసిన సాహసాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సుమారు 3400 కోట్ల బడ్జెట్ తో తిరిగి ఎక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 6000 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సరికొత్త సంచలనాలను సృష్టించిందని చెప్పాలి. ఇలా హాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది.
అదనంగా చెల్లించాల్సిందేనా?
తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని(Ott Release Date) అధికారికంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులోకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 19వ తేదీ ఈ సినిమా ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాని డిజిటల్ ప్లాట్ ఫామ్ లో చూడాలనుకుంటే తప్పని సబ్స్క్రిప్షన్ తో పాటు అదనంగా ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. క్రిస్టోఫర్ మెక్ క్వారీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మొదటి సిరీస్ నుంచి ఇప్పటివరకు ఒకే చిత్ర బృందం నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
హై వోల్టేజ్ యాక్షన్ మూవీ…
ఇకపోతే ఈ సిరీస్ మొత్తం ఒకే కథ నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. హీరో తన టీం తో కలిసి ఈ ప్రపంచాన్ని రక్షించడం కోసం ఎంతో విలువ చేసే డాక్యుమెంట్లు అలాగే ఆయుధాలు శత్రువుల చేతికి వెళ్లకుండా కాపాడే నేపథ్యంలోనే మిషన్ ఇంపాజిబుల్ సినిమా వివిధ సిరీస్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యాక్షన్ సినిమాలు అంటే ఇష్టపడే వారికి ఈ సినిమా అద్భుతంగా నచ్చుతుందనే చెప్పాలి. మరి ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమా ఆగస్టు 19వ తేదీ ఓటీటీలోకి రాబోతున్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందనేది తెలియాల్సి ఉంది. ఇక అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా చూడాలనుకునేవారు అదనంగా ఎంత డబ్బు చెల్లించాలి ఏంటి అనే వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Mega Family on HHVM : వీరమల్లుకు మెగా ఫ్యామిలీ దూరం… కట్టగట్టుకుని అందరూ ఇలా చేస్తున్నారేంటి ?