BigTV English

Asteroid Hitting Earth : భూమికి అత్యంత చేరువగా భారీ ఆస్ట్రాయిడ్..

Asteroid Hitting Earth : భూమికి అత్యంత చేరువగా భారీ ఆస్ట్రాయిడ్..
Asteroid Hitting Earth


Asteroid Hitting Earth : స్పేస్‌లో పనిచేయని శాటిలైట్లు, స్పేస్‌క్రాఫ్ట్స్ నుండి ఊడిపోయిన భాగాలు.. ఇలాంటి వాటితో పూర్తిగా చెత్త నిండిపోయి ఉంది. ఈ చెత్తను తొలగించడానికి శాస్త్రవేత్తలు ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడప్పుడు ఈ చెత్త అనేది భూమికి ప్రమాదకరంగా కూడా మారవచ్చు. బరువుగా ఉన్న ఏ శాటిలైట్ భాగమయినా భూమికి తాకి పేలుడు లాంటిది జరగవచ్చు. దీంతో పాటు గ్రహశకలాల వల్ల కూడా భూమికి ప్రమాదం పొంచివుంది. తాజాగా ఒక గ్రహశకలం భూమిపైకి దూసుకొస్తుందని శాస్త్రవేత్తలు గమనించారు.

గ్రహశకలాలు అనేవి ఎక్కువగా అంతరిక్షంలోనే తిరుగుతుంటాయి. వాటి దిశను కూడా శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. కానీ అప్పుడప్పుడు వీటి వల్ల భూమికి కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ ప్రమాదాలను ముందస్తుగా గమనించగలిగితే శాస్త్రవేత్తలు అడ్డుకునే ప్రయత్నాలు చేయగలరు. కానీ ఒక్కొక్క సందర్భంలో వారు చేసే ప్రయత్నాలు కూడా పూర్తిస్థాయిలో సఫలం కాకపోవచ్చు. తాజాగా అలాంటి ఒక ఆస్ట్రాయిడ్ భూమి దగ్గరికి దూసుకొస్తున్నట్టుగా వారు గమనించారు. అంతే కాకుండా అది అత్యంత ప్రమాదకరంగా దగ్గరగా వస్తుందని బయటపెట్టారు.


తాజాగా మూడు ఆస్ట్రాయిడ్స్.. భూమికి దగ్గరగా వస్తున్నట్టుగా నాసా జెట్ ప్రపోల్షన్ లేబురేటరీ తెలిపింది. అందులో అన్నింటికంటే పెద్ద ఆస్ట్రాయిడ్ 2023 ఎమ్ఎఫ్1. ఇది దాదాపు 120 అడుగుల సైజ్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఇది భూమికి అత్యంత దగ్గరగా పాస్ అవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది 63986 కిలోమీటర్ల వేగంతో భూమి నుండి 1.2 మిలియన్ మైళ్ల దూరం నుండి ప్రయాణిస్తుందని తెలిపారు. మామూలుగా చూసుకుంటే ఆస్ట్రాయిడ్ భూమికి ఇంత దగ్గరగా రావడం అత్యంత ప్రమాదకరం. కానీ ఈ ఆస్ట్రాయిడ్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు చెప్పారు.

టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కూడా ఆస్ట్రాయిడ్స్‌ను ట్రాక్ చేసే విషయంలో ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ఏర్పాటు కాలేదని శాస్త్రవేత్తలు వాపోతున్నారు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో ఆస్ట్రాయిడ్స్ వల్ల భూమికి ఎంత ప్రమాదం జరుగుతుందని స్పష్టంగా చెప్పలేమన్నారు. నియో ఆబ్జర్వేషన్ ప్రోగ్రామ్ ద్వారా భూమికి దగ్గరగా వచ్చే వస్తువుల గురించి, వాటి వల్ల భూమికి జరిగే ప్రమాదం గురించి తెలుసుకునే అవకాశం ఉంది కానీ ఆస్ట్రాయిడ్స్‌ను మాత్రం స్పష్టంగా ట్రాక్ చేయలేమన్నారు. అందుకే ఇలాంటి వాటికోసమే నాసా కొత్త టెక్నాలజీలు కనిపెట్టే ప్రయత్నాలు చేస్తోంది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×