E-Paper
Advertisement

Electric Cars: ఎలక్ట్రిక్ కార్ల కోసం రెండు లగ్జరీ బ్రాండ్స్ కాంట్రాక్ట్..

Electric Cars: ఎలక్ట్రిక్ కార్ల కోసం రెండు లగ్జరీ బ్రాండ్స్ కాంట్రాక్ట్..
Advertisement

Electric Cars: ఎలక్ట్రిక్ కార్లపై పెరుగుతున్న క్రేజ్ చూసి లగ్జరీ కార్ బ్రాండ్లు సైతం ఎలక్ట్రిక్ కార్ల తయారీని చేపట్టక తప్పడం లేదు. ఇప్పటికే పలు లగ్జరీ కార్ బ్రాండ్స్ ఎలక్ట్రిక్ కార్ల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాయి. రోల్స్ రాయిస్ లాంటి కంపెనీ సైతం ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తామంటూ ప్రకటించింది. తాజాగా బ్రిటిష్‌కు చెందిన అల్ట్రా లగ్జరీ కార్ల బ్రాండ్ అయిన ఆస్టన్ మార్టిన్ కూడా ఎలక్ట్రిక్ కార్లు తయారు చేయాలని నిర్ణయించుకుంది. కాకపోతే దీనికోసం మరో కార్ బ్రాండ్‌తో చేతులు కలపనుంది.

ల్యూసిడ్ అనేది కాలిఫోర్నియాకు చెందిన ఎలక్ట్రిక్ లగ్జరీ కార్ స్టార్టప్. ల్యూసిడ్‌కు అతి తక్కువ సమయంలోనే చాలా క్రేజ్ ఏర్పడింది. అందుకే ఆస్టన్ మార్టిన్ కూడా ఎలక్ట్రిక్ కార్ల తయారీ విషయంలో ల్యూసిడ్‌తో చేతులు కలపడానికి సిద్ధమయ్యింది. ఆస్టన్ మార్టిన్ ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించి బ్యాటరీ సిస్టమ్స్‌ను భవిష్యత్తులో ఆ సంస్థకు అందించడానికి ల్యూసిడ్ కాంట్రాక్ట్ చేసుకుంది. 25 వరకు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేస్తామని ఆస్టన్ మార్టిన్ గతేడాది ప్రకటించింది. ప్రస్తుతం దానికోసం కావాల్సిన సన్నాహాలను వేగవంతం చేసింది.

Advertisement

తాజాగా ప్రకటించిన కాంట్రాక్ట్ ప్రకారం ఆస్టన్ మార్టిన్‌లో 3.7 శాతం స్టేక్‌ను ల్యూసిడ్ దక్కించుకోనుంది. ఆస్టన్ మార్టిన్ ముందుకొచ్చి తమ సంస్థను ఎంచుకుందని ల్యూసిడ్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ కాంట్రాక్ట్ విలువ 450 మిలియన్ డాలర్లని తెలుస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వెహికిల్స్ మాత్రమే కాదు ఫ్లూయల్ వెహికిల్స్‌ను కూడా తయారు చేసే విషయంలో మెర్సిడీస్ బెంజ్‌తో చేతులు కలిపింది ఆస్టన్ మార్టిన్. ఇప్పుడు ల్యూసిడ్‌తో కూడా కాంట్రాక్ట్ చేసుకోవడంతో ఆస్టన్ మార్టిన్ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో సీరియస్‌గా ఉందని నిపుణులు అనుకోవడం మొదలుపెట్టారు.

ల్యూసిడ్ ఇప్పటికే తన సొంత ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ల్యూసిడ్ ఎయిర్ అనే పేరుతో మార్కెట్లోకి లాంచ్ అయిన ఎలక్ట్రిక్ కారు స్టార్టింగ్ ధర 90 వేల డాలర్లని తెలుస్తోంది. ఇక అప్పుడే ల్యూసిడ్ ఎయిర్‌కు ఎన్నో అవార్డులు కూడా దక్కాయి. మొదట్లో ఈ సంస్థ.. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కష్టపడినా.. ఇప్పుడు ఆస్టన్ మార్టిన్ అనే కంపెనీతో డీల్ చేసుకోవడం అనేది చాలా పెద్ద విషయమని ల్యూసిడ్ సక్సెస్ గురించి ఆటోమొబైల్ సంస్థలు మాట్లాడుకుంటున్నాయి.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×