BigTV English

CM Jagan speech: లారీ ఎక్కి పూనకాలు.. బటన్ నొక్కని బడుద్ధాయి.. పవన్‌కు జగన్ పంచ్‌లు..

CM Jagan speech: లారీ ఎక్కి పూనకాలు.. బటన్ నొక్కని బడుద్ధాయి.. పవన్‌కు జగన్ పంచ్‌లు..
cm jagan speech

YS Jagan meeting today live(AP politics): ఇన్నాళ్లూ దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్, చంద్రబాబు స్క్రిప్ట్ ఇలాంటి విమర్శలు మాత్రమే చేసేవారు సీఎం జగన్. వారాహి యాత్రతో పవన్ దూకుడు పెరిగాక.. జగన్ సైతం డోసు పెంచారు. డైరెక్ట్‌గా పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలే చేశారు.


వారాహిని లారీతో పోల్చారు జగన్. ఆ లారీ ఎక్కి ఊగిపోతారన్నారు. నచ్చని వారిని చెప్పుతో కొడతానంటాడు.. తాట తీస్తానంటాడు.. ఇష్టానుసారం నోటికొచ్చినట్టు మట్లాడుతాడు.. ఆ ప్యాకేజీ స్టార్ నోటికి అడ్డూఅదుపు ఉండదు.. నిలకడ కూడా ఉండదు.. ఆయనలా నలుగురిని పెళ్లి చేసుకుని భార్యను మార్చలేమన్నారు. దత్తపుత్రుడిలా తొడలు కొట్టలేమని.. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ బూతులు తిట్టలేమని.. అవన్నీ వారికి పేటెంట్‌ అని.. పవన్ కల్యాణ్‌ను పదునైన వ్యాఖ్యలతో విమర్శించారు సీఎం జగన్.

ఏపీ సీఎం నొక్కని బటన్లు అంటూ పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు జగన్. నవరత్నాల ద్వారా లబ్దిదారులకు వేల కోట్ల రూపాయలు అందించామని, బటన్‌ నొక్కడం అంటే ఇదీ అని అన్నారాయన. ఈ విషయాన్ని బటన్‌ నొక్కడమంటే తెలీని బడుద్ధాయిలకు చెప్పాలని ప్రజలకు సూచించారు. దత్తపుత్రుడు 2014లోనూ చంద్రబాబుకు మద్దతు ఇచ్చాడు.. మరి ఆ తర్వాత చంద్రబాబు చేసిన మోసాన్ని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు.


వైసీపీ పునాదులు సామాజిక న్యాయంలో ఉన్నాయన్నారు సీఎం జగన్. అందుకే పనికి మాలిని పంచ్‌ డైలాగులు ఉండవని చెప్పారు. పొత్తుల కోసం ఏరోజూ పాకులాడలేదన్నారు. రాష్ట్రంలో రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని.. జరగబోయే కురుక్షేత్రంలో ప్రజలకే తనకు అండ అన్నారు.

జగనన్న అమ్మ ఒడి పథకం నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా.. కురుపాం బహిరంగ సభలో మాట్లాడారు సీఎం జగన్.

పార్వతీపురం మన్యం జిల్లాలో సీఎం జగన్ పర్యటన
నాలుగో విడత అమ్మఒడి నిధుల విడుదల
పది రోజులపాటు పండుగలా అమ్మ ఒడి -జగన్
పేద పిల్లలు చదవాలి..ఎదగాలి -జగన్
పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలి -జగన్
ప్రతి కుటుంబం నుంచి ఒక సత్యనాదేళ్ల రావాలి
మన పిల్లలు గ్లోబల్‌ సిటిజన్స్‌గా ఎదగాలి -జగన్
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది..
ప్రపంచంలోని టాప్‌-50 కాలేజీల్లో సీటు వస్తే.. రూ.1కోటి 50 లక్షలు ఇస్తున్నాం -జగన్
8వ తరగతి నుంచి ట్యాబ్స్ అందిస్తున్నాం -జగన్
ఉన్నత చదువుల కోసం పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇస్తున్నాం
నాలుగేళ్లలో విద్యారంగానికి రూ. 66వేల 722 కోట్లు ఖర్చు -జగన్

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×