E-Paper
Advertisement

Astro Tips : జాగ్రత్త.. ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు అసలు చేయొద్దు..!

Astro Tips : జాగ్రత్త..  ఉదయం నిద్ర లేవగానే ఈ  పనులు అసలు చేయొద్దు..!
Advertisement

Astro Tips : ఉదయం చాలా విలువైనది. ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అనేక మత గ్రంధాలలో కూడా ఇదే పేర్కొనడం జరిగింది. ఉదయం మనం పొందే శక్తి రోజంతా మనతో ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి.. పఠనం, పూజలు, వ్యాయామం చేస్తే రోజంతా ఉత్సహంగా, శక్తి వంతంగా ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో ఉదయం లేవగానే కొన్ని తప్పుడు పనులు చేస్తుంటారు. అలా చేయడం వలన ఏ పని కూడా సక్రమంగా జరగవని అంటున్నారు పండితులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఉదయం నిద్రలేచిన వెంటనే కొన్ని పనులు చేయకూడదు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ఉదయాన్నే నిద్రలేవగానే కొందరికి అద్దంలో ముఖం చూసుకునే అలవాటు ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. దీని కారణంగా ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఈ ప్రభావం మన ఆలోచన శక్తిపై పడి.. చేయాల్సిన పనులు మందుకు కదలవు.
  • ఉదయం లేచిన వెంటనే మురికి పాత్రలు అస్సలు చూడకూడదు. శాస్త్రాల ప్రకారం అలా చూస్తే.. శరీరంలో పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుందట. వంట గదిలో మురికి పాత్రలు పేదరికాన్ని సూచిస్తుందని పండితులు చెబుతున్నారు. మురికి పాత్రలు రాత్రి సమయంలో సింక్‌లో ఉండకూడదు.
  • ఉదయం లేచిన వెంటనే ఇంట్లో ఆగిపోయిన లేదా పాడైపోయిన గడియారాన్ని అస్సలు చూడకూడదు. అలా చేస్తే ఆ రోజంతా అశుభం జరుగుతుందట. లేనిపోని గొడవలు జరుగుతాయట. ఇంకా సూది గానీ, దారం గానీ చూడొద్దని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది.

గమనిక: ఇది జ్యోతిష్యశాస్త్రం, మత గ్రంథాల ఆధారంగా సేకరించిన సమాచారం మాత్రమే.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×