Big Stories

India Vs Srilanka : సిరీస్ పై భారత్ గురి..గెలుపు కోసం లంక ఆరాటం.. నేడు రెండో టీ20 మ్యాచ్..

India Vs Srilanka : నేడు పుణె వేదికగా రాత్రి 7 గంటలకు భారత్-శ్రీలంక మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ముంబైలో జరిగిన తొలి మ్యాచ్ లో గెలిచి టీమిండియా జోరుమీదుంది. ఇక రెండో మ్యాచ్ లోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్ లో భారత్ జట్టు అంచనాలను అందుకోలేకపోయింది.

- Advertisement -

బ్యాటింగ్ కు అనుకూలించిన పిచ్ పైనా మన బ్యాటర్లు తడబడ్డారు. కెరీర్ లో తొలి మ్యాచ్ ఆడిన శుభ్ మన్ గిల్ ఫెయిల్ అయ్యాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ మెరుపులు మెరిపించలేకపోయాడు. తన ట్రేడ్ మార్క్ షాట్ కే అవుట్ అభిమానులను నిరాసపర్చాడు . చాన్నాళ్ల తర్వాత తుది జట్టులోకి వచ్చిన సంజు శాంసన్‌ కూడా అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. కెప్టెన్ హార్థిక్ పాండ్యా దూకుడుగా ఆడలేకపోయాడు. తొలి మ్యాచ్ లో ఇషాన్ కిషన్ , దీపక్ హుడా, అక్షర్ పటేల్ మాత్రమే బ్యాట్ తో మెరుగ్గా రాణించారు. రెండో టీ20లో సూర్యప్రతాపం కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అలాగే గిల్ కు మరో అవకాశం దక్కితే వినియోగించుకోవాలి. లేదంటే టీ20 జట్టులో స్థానం కోల్పోయే అవకాశం ఉంది. ఇక కెప్టెన్ పాండ్యా తన బ్యాటింగ్ పవర్ చూపించాల్సిన సమయం ఆసన్నమైంది.

- Advertisement -

తొలి మ్యాచ్ లో బౌలర్ల మెరుగైన ప్రదర్శన వల్లే భారత్ విజయం సాధించింది. ప్రత్యర్థి ముందు అనుకున్నంత భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయినా..శ్రీలంకను టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. తొలిమ్యాచ్ లో స్పిన్నర్లు పూర్తిగా విఫలయ్యారు. పేసర్లే రాణించారు. ఇద్దరు శ్రీలంక బ్యాటర్లు రనౌట్ కాగా..మిగిలిన 8 వికెట్లు పేసర్లకే దక్కాయి. శివం మావి, ఉమ్రాన్ మాలిక్ సత్తాచాటారు. హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీసినా..భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. మరి హర్షల్ కు మరో ఛాన్స్ ఇస్తారా లేదా అర్ష్ దీప్ ను బరిలోకి దించుతారో చూడాలి. తొలి మ్యాచ్ లో చాహల్, అక్షర్ పటేల్ భారీగా పరుగులు ఇచ్చేశారు. ఆరంభంలో మెరుగ్గా బౌలింగ్ చేస్తున్న భారత్ బౌలర్లు చివరిలో తేలిపోతున్నారు. ఈ బలహీనత వల్లే తొలి టీ20 ఉత్కంఠగా సాగింది. లేదంటే టీమిండియా సునాయాసంగా గెలిచేది. సంజు శాంసన్ గాయపడటంతో రుతురాజ్‌ గైక్వాడ్, రాహుల్‌ త్రిపాఠిల్లో ఒకరికి తుది జట్టులో చోటు దక్కొచ్చు. బ్యాటర్లు, బౌలర్లు నిలకడగా రాణిస్తే ఈ మ్యాచ్ లో సిరీస్‌ భారత్ సొంతమవుతుంది. లేదంటే శ్రీలంక షాక్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది.

ప్రస్తుతం శ్రీలంక జట్టు ఆల్ రౌండర్లతో బలంగా ఉంది. అందుకే తొలి మ్యాచ్ లో వందలోపే సగం వికెట్లు పడిపోయినా గట్టిగా పోరాడింది. చివరి వరసలో దాటిగా బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు ఉన్నారు. ఆ జట్టు బౌలర్లు తొలి మ్యాచ్ లో మెరుగైన ప్రదర్శన చేశారు. ముంబయిలో స్పిన్నర్లు హసరంగ, తీక్షణ, ధనంజయ.. భారత్ బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టారు. పుణె పిచ్‌ కూడా స్పిన్‌కు సహకరిస్తుందని అంచనా వేస్తున్నారు. మరి లంక స్పిన్నర్లుతో జాగ్రత్తగా ఉండాలి. వికెట్‌ కీపర్‌ కుశాల్‌ మెండిస్‌ క్రీజులో నిలబడితే అతడిని ఆపటం కష్టం . తొలి టీ20లో విఫలమైన నిశాంక, అసలంక, రాజపక్స ప్రమాదకార బ్యాటర్లే. వారు రాణిస్తే రెండో టీ20 ఉత్కంఠగానే సాగే అవకాశం ఉంది. భారత్ సిరీస్ గెలుపుపై గురిపెడితే..లంక సమం చేయాలన్న పట్టుదలతో ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News