BigTV English

Ayyappa : అయ్యప్పమెడలో నిమ్మకాయ దండ ఎందుకు వేస్తారో తెలుసా

Ayyappa : అయ్యప్పమెడలో నిమ్మకాయ దండ ఎందుకు వేస్తారో తెలుసా

Ayyappa : కనకదుర్గమ్మ, అయ్యప్పస్వామి మెడలో మాత్రమే నిమ్మకాయల దండలు వేస్తుంటారు. మిగతా దేవుళ్లకు ఇలాంటి దండలు వేయరు. కారణం ఉగ్రకాళి, భద్రకాళి అయిన అమ్మవారి కోపాన్ని చల్లార్చడానికి ,శాంతింప చేయడానికి నిమ్మకాయల దండ నుంచి చలువే ప్రధానమైన కారణం. మహారౌద్రంగా ఉన్న అమ్మవారి ఒంటికి చలువ తగలడం వల్ల శాంతిస్తుంది. ఎంతోమంది రాక్షసులను సంహరించాడనికి ఉగ్రకాళి అవతారం ఎత్తిన అమ్మ కోపాన్ని చల్లార్చడానికి నిమ్మకాయల దండను వేస్తారు.


మరి అయ్యప్ప స్వామికి నిమ్మకాయలదండ వేయడానికి ఒక కారణం ఉంది. 48 రోజుల పాటు నిష్ఠగా పాటించే అయ్యప్పస్వామి దీక్ష పరుల్లో ఉష్ణతత్వం పెరిగిపోతుంది. శబరిగిరీశుడు అయ్యప్ప కూర్చునే శరీర భంగిమ వల్ల కూడా ఉష్ణతత్వం పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటి ఉష్ణతత్వాన్ని తగ్గించి నిత్య బ్రహ్మచారిగా సేవలు అందుకుంటానని స్వామి వారు వరం ఇచ్చారు. ఆ మాట ప్రకారం నాటి నుంచి అయ్యప్ప సేవలు అందుకుంటున్నారు. అందుకు ప్రతీకగా నిమ్మకాయల దండను స్వామి వారికి అలంకరిస్తుంటారు.

స్వామి వారికి నెయ్యాభిషేకం చేయడం వెనక కారణం పరమేశ్వరుడు భక్తులకి వరమే. అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పొరపాటును గాని అపవిత్రంగా గాని తాకితే ఆ పని చేసిన భక్తులకు నష్టం జరగకుండా ఉండేందుకు వారిని కాపాడేందుకు పరిహారంగా నెయ్యాభిషేకం చేస్తుంటారు. నెయ్యాభిషేకం వెనుక పరామర్థమిదే. ఈ నిమ్మకాయలను కూడా అదే విధంగా వాడుకోవచ్చు. అయ్యప్ప స్వామి విషయంలో మన ఆచరించే నియమాలు,కానీ, పూజలు వెనక ఎంతో అంతరార్థం ఉంది.


Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×