Bachelor are Husband : భర్తను పోగొట్టుకున్న స్త్రీ శుభకార్యాలకు ఏవిధంగా పనికిరారో భార్య లేని భర్త కూడా శుభకార్యాలకు పనికిరాడదని శాస్త్రం చెబుతోంది. పురుషుడు వివాహ సమయంలో వధువును తన దాన్నిగా చేసుకునే సమయంలో గురు,బంధు మిత్రుల సమక్షంలో దైవసాక్షిగా, ధర్మేచ, కామేచ, మోక్షేచ, నాతి చరామి అన్న ప్రమాణమే. ఈ కారణంగానే ధర్మపరులైన స్త్రీ, పురుషులు ద్వితీయ వివాహానికి అంగీకరించరు. కష్టాలతో కాపురం చేయడానికి అయినా ఇష్టపడతారుగానీ, మరో పెళ్లికి అంగీకరించరు. కాని నేటి నాగరిక ప్రపంచంలో ఈవిషయాన్ని పాత చింతకాయ పచ్చడంటూ కొట్టిపారేస్తుంటారు. కానీ దీర్ఘంగా ఆలోచిస్తే వివాహ ధర్మంలోని నిజాయితీ ఏమిటో అర్థం అవుతుంది.
త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రజాహితం కోసం అశ్వమేథయాగం చేయాల్సి వచ్చింది. అప్పటికే శ్రీరాముడు సీతను పరిత్యజించాడు. అందువల్లే అశ్వమేధం చేయడానికి శ్రీరాముడు అంగీకరించలేదు. ఆ క్లిష్టసమయంలో కులగురువైన వశిష్టుడు, బావగారైన రుష్య శృంగమహర్షి ధర్మశాస్త్రాలను శోధించి స్వార్థరహితమైన ప్రజాకార్యం కావడం వల్ల ప్రజాధనంతో స్వర్ణప్రతిమను చేయించి ఆప్రతిమను పక్కనే పెట్టుకుని అశ్వమేధయాగం చేయమని చెప్పారు. ఈ రామాయణ కథలో ఈ విషయంలో అందరికి తెలిసే ఉంటుంది.
భర్తమరణించి వితంతువును చాలా మంది శుభకార్యాలకు పిలువరని మాత్రమే తెలుసు. భార్య మరణించిన పురుషునికి కూడా ఏ ధర్మకార్య నిర్వహణకూ పనికిరాడని కొద్దిమందికి మాత్రమే తెలుసు. హిందూ ధర్మ వ్యవస్థలో ఆలుమగల అనుబంధానికి పవిత్రతకు ఎంతో పెద్దపీట వేశారు. అందుకే ఈ భూమి గొప్పది. మన ధర్మం గొప్పది.