E-Paper
Advertisement

Akhanda 3 : అప్పుడు జై హనుమాన్.. ఇప్పుడు జై అఖండ.. సస్పెన్స్ సస్పెన్స్

Akhanda 3 : అప్పుడు జై హనుమాన్.. ఇప్పుడు జై అఖండ.. సస్పెన్స్ సస్పెన్స్
Advertisement

Akhanda 3 Movie News : అవును అంతా… సస్పెన్స్ సస్పెన్స్. జై హనుమాన్, జై అఖండ సినిమా విషయంలో సస్పెన్స్‌గానే ఉంది. గతేడాది స్టార్టింగ్‌లో వచ్చిన హనుమాన్ మూవీకి రాబోయే సీక్వెల్‌ జై హనుమాన్‌కి.. ఈ ఏడాది చివర్లో వచ్చిన అఖండ2 తాండావం మూవీకి రాబోయే సీక్వెల్ జై అఖండ మూవీకి సంబంధం ఏంటి..? వాటి విషయంలో ఈ సప్సెన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం…

2024 సంక్రాంతి టైంలో చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ మూవీ పెద్ద విషయం సాధించింది. ఆ సినిమాకు సీక్వెల్‌గా జై హనుమాన్ అనే మూవీ వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనిపై తర్వాత చాలా సస్పెన్స్ సాగింది. నిర్మాత మారడం… డైరెక్టర్ – నిర్మాతల మధ్య గొడవలు.. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పోస్టులు పెట్టుకోవడం ఇలా చాలా జరిగాయి.

Advertisement

ఒకనొక సందర్భంలో జై హనుమాన్ మూవీ రద్దు అయింది అనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఇది ఎందుకు గుర్తుకు రావడానికి కారణం ఏంటంటే… జై అఖండ.

ఈ రోజు బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ 2 రిలీజ్ అయింది. నిన్నటి ప్రీమియర్ షోల నుంచి సినిమాకు మిక్సిడ్ టాక్ వస్తుంది. సినిమా ఓన్లీ ఫర్ బాలయ్య ఫ్యాన్స్ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Advertisement

అయితే, ఈ అఖండ 2 సినిమాకు సీక్వెల్ ఉండబోతుంది. దానికి జై అఖండ అనే టైటిల్ ఉండబోతుందనే హిట్ సినిమా చివర్లో ఇచ్చాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఈ అఖండ 3.. జై అఖండ మూవీ శంభాల లో ఉంటుందనే హిట్ కూడా ఇచ్చారు సినిమా చివర్లో.

అయితే, ఇప్పుడు అఖండ 3.. జై అఖండ మూవీ అసలు ఉంటుందా అనే ఊహగనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. దీనికి కారణం ఈ సినిమా ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యలే అని చెప్పొచ్చు. నిర్మాతలు 14 రీల్స్ ఫైనాన్స్ ఇష్యూలు.. తర్వాత ఇరోస్ వాళ్లతో ఉన్న ఇష్యూలు.. తర్వాత టికెట్స్ ఇష్యూ.. ఇలా ఇన్ని సమస్యల మధ్య రిలీజ్ అయింది.

ఫస్ట్ డే కలెక్షన్స్.. 

ఇవన్నీ పక్కన పెడితే.. సినిమాకు కూడా మిక్సిడ్ టాక్ వచ్చింది. ఆ ప్రభావం కలెక్షన్స్‌పై పడింది. ఈ మూవీకి ప్రీమియర్స్‌తో కలుపుకుని మొదటి రోజు వరల్డ్ వైడ్ 32 కోట్లు మాత్రమే వచ్చినట్టు తెలుస్తుంది. అందులో 3 కోట్లు ఓవర్సీస్ నుంచి, 40 లక్షల వరకు కన్నడ, 35 లక్షలు తమిళనాడు నుంచి వచ్చినట్టు సమాచారం. ఇక నార్త్ లో అయితే.. ఈ సినిమా ప్రభావం అసలేం లేనట్టు తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాకు సీక్వెల్ చేస్తారా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది.

ఈ మధ్య సీక్వెల్ సినిమాలు రావడం కామెన్ అయిపోయింది. అలాగే.. కొన్ని సినిమాలు ఆ సీక్వెల్స్ ను రద్దు చేసుకుంటున్నాయి. ఇటీవల కొన్ని సినిమాలు తమ పార్ట్ 2 ను క్యాన్సిల్ చేసుకుంటున్నాయి అనే వార్తలు ఎక్కువ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దేవర 2, కింగ్‌డం 2 తో పాటు మరి కొన్ని సినిమాలు కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి. ఆ లిస్ట్ లోకి ఈ జై అఖండ, జై హనుమాన్ సినిమాలు కూడా వస్తాయా అనేది చూడాలి.

అయితే జై హనుమాన్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. కన్నడ రిషభ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తున్నాడు. మధ్యలో చిన్న డిస్ట్రర్బ్ అయినట్టు వార్తలు వచ్చినా.. ఇప్పుడు జై హనుమాన్ షూటింగ్ దశలో ఉందని సమాచారం.

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×