Big Stories

Tips for Healthy Hair : బీరుతో జుట్టు బలంగా తయారవుతుంది

Tips for Healthy Hair

Tips for Healthy Hair : జుట్టు అందంగా కనిపించడం కోసం రకరకాల షాంపులు, కండీషనర్లను వాడుతుంటాం. అయినా ఏదో వెలితి ఉంటుంది. మీ జుట్టు రోజంతా తాజాదనం, ఒత్తుగా కనిపించాలంటే బీరుతో తల స్నానం చేస్తే అద్భుత ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. బీరులో ఉండే పోషకాలతో జుట్టును తడిపితే ఇందులో ఉండే ఈస్ట్ వెంట్రుకల మొదళ్లకు బలాన్ని చేకూర్చి జుట్టును పటిష్టంగా మారుస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే బీర్‌కు ఇతర పదార్థాలను కలపటం వలన జుట్టు కాంతివంతంగా మారుతుంది. తలపై చర్మం మరియు జుట్టు శుభ్రంగా ఉండాలంటే షాపు వాడుతాం. మనం రోజూ వాడే షాంపూలో బీరును కలిపి జుట్టుకు రాసుకుని 5 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. తర్వాత చల్లటి నీటితో కడగాలి.

- Advertisement -

ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాకపోతే బీరు నుంచి వచ్చే వాసనపోవడానికి కండీషనర్‌ వాడటం మాత్రం మర్చిపోవద్దు. తలకు బీరు వాడటం వల్ల దుమ్ము, ధూళిని తొలగిస్తుంది. జుట్టులో చిక్కుకుపోయిన దుమ్మును బీర్-వెనిగర్ తొలగించినట్టు ఏ ఇతర లిక్విడ్‌లు తొలగించలేవు. ఒక ఔన్‌ నీళ్లు, 2 చెంచాల ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌, ఒక ఔన్‌ బీరు, కొన్ని చుక్కల ఎస్సేన్శియాల్ నూనె కలిపి జుట్టుకు అప్లై చేసి నీటితో కడగాలి. అంతేకాకుండా బీరును కండీషనర్‌గానూ ఉపయోగించవచ్చు. ఒక కప్పు బీరును వేడి చేసి దానికి ఒక చెంచా జోజోబ నూనెను కలపాలి. దీన్ని జుట్టుకు అప్లై చేసి కనీసం 10 నిమిషాలు అలాగే ఉంచాలి.

- Advertisement -

దీంతో మీ జుట్టు డల్‌గా, గరుకుగా ఉండదు. బీరు వాడటం వల్ల చుండ్రుతో కలిగే సమస్యలు దూరం అవుతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు కావాల్సిన బయోటిన్ అనే విటమిన్ బీరులో పుష్పలంగా ఉంటుంది. బీరులో ఉండే బయోటిన్ చుండ్రును నివారించి, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. బీరులో ప్రోటీన్, విటమిన్‌ బి, ఐరన్, కాల్షియం, ఫాస్పేట్‌తో పాటు ఫైబర్ ఉంటుంది. ఇవి వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచి పాడైనవాటికి తిరిగి పునర్జీవం వచ్చేలా చేస్తాయి. బీరు, తేనె, నిమ్మకాయ రసం కలిపి ఇంట్లోనే జుట్టు కోసం మాస్క్ రెడీ చేసుకోవచ్చు. బీరును పాత్రలో తీసుకొని నిమిషం పాటు వేడి చేయాలి, దీనికి కొన్ని చుక్కల తేనె, నిమ్మకాయ రసాన్ని కలపాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత జుట్టుకు వేసుకోవాలి, పావుగంట తర్వాత చల్లటి నీటితో కడగాలి. దీంతో జుట్టు నిగనిగలాడుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News