BigTV English

Milk : పాలు తాగే ముందు.. ఇవి తెలుసుకోండి..!

Milk : మనకుండే నిత్యావస వస్తువుల్లో పాలు కూడా ఒకటి. గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి అధిక మొత్తంలో పోషకాలు అందుతాయి. పాలలో అధికశాతం ఉండే అమైనో ఆమ్లాలు, కొవ్వు పదార్థాలు పిల్లల శారీరక ఎదుగుదలకు తోడ్పడతాయి. అందుకే మమ్మీ పాలొద్దు.. స్మెల్ వస్తున్నాయని పిల్లలు మారం చేస్తున్నా బలవంతంగా తాగిచ్చేస్తాం.

Milk : పాలు తాగే ముందు.. ఇవి తెలుసుకోండి..!

Milk : మనకుండే నిత్యావసర వస్తువుల్లో పాలు కూడా ఒకటి. గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి అధిక మొత్తంలో పోషకాలు అందుతాయి. పాలలో అధికశాతం ఉండే అమైనో ఆమ్లాలు, కొవ్వు పదార్థాలు పిల్లల శారీరక ఎదుగుదలకు తోడ్పడతాయి. అందుకే మమ్మీ పాలొద్దు.. స్మెల్ వస్తున్నాయని పిల్లలు మారాం చేస్తున్నా బలవంతంగా తాగిచ్చేస్తాం.


అయితే ఇప్పుడు మార్కెట్‌లో రకరకాల పేర్లతో పాలు అభిస్తున్నాయి. డెయిరీ సంస్థలు టోల్డ్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్, క్రీమ్‌లెస్ మిల్క్.. మొదలైన పేర్లతో పాల ప్యాకెట్లు మార్కెట్లో ఉంచుతున్నారు. అయితే వీటిలో ఏ రకం పాలు ఎవరు వినియోగించాలో తెలుసుకుందాం.

ఫుల్ క్రీమ్ మిల్క్


కొవ్వు పదార్థాలను వేరు చేయకుండా ఉంచిన పాలను హోల్ మిల్క్ లేదా ఫుల్ క్రీమ్ మిల్క్ అంటారు. ఈ పాలలో 3.5 శాతం కొవ్వు ఉంటుంది. మనిషి మెదడు పరిపూర్ణంగా ఏర్పడటానికి 60 శాతం కొవ్వు అవసరం. అందుకనే ఎదిగే పిల్లలకు ఈ పాలు చాలా అవసరం. పాలలో విటమిన్ ఎ,డి, బి1, కాల్షియం, ఫాస్పరస్ మొదలైనవి లభిస్తాయి. ఫుల్ క్రీమ్ పాలను చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లలు తాగొచ్చు.

స్కిమ్డ్ మిల్క్

కొవ్వును తీసేసిన పాలను స్కిమ్డ్ మిల్క్ లేదా నో-ఫ్యాట్ మిల్క్ అంటారు. ఈ పాలలో 0.3 శాతం మాత్రమే కొవ్వు ఉంటుంది. పాలు తాగడం వల్ల బరువు పెరుగుతామని భావించే వారు ఈ పాలను తాగొచ్చు.

టోన్డ్ మిల్క్

పాల పౌడర్, నీళ్లు కలిపిన పాలను టోన్డ్ మిల్క్ అంటారు. ఇలా చేయడం వల్ల సాధారణంగా పాలల్లో ఉండే 9-10 శాతం కొవ్వు 3 శాతానికి తగ్గుతుంది. ఈ పాలు త్వరగా జీర్ణం అవుతాయి. పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. పోషకాహార్ లోపంతో బాధపడేవారు, గర్భీణీ స్త్రీలు ఈ పాలను తాగొచ్చు.

డబుల్ టోన్డ్ మిల్క్

టోన్డ్ మిల్క్ పద్థతిలోనే ఈ రకం పాలను తయారు చేస్తారు. అదే విధంగా పాశ్చరైజేషన్ పద్ధతిని కూడా ఉపయోగిస్తారు. ఈ పాలను 100 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలో వేడి చేసి ప్యాకెట్లుగా తయారు చేస్తారు. ఇలా చేయడం వల్ల అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇందులో 1.5 శాతం మాత్రమే కొవ్వు ఉంటుంది. గుండె పనితీరును మెరుగుపరచడంలో ఈ పాలు ఉపయోగపడతాయి. అధిక బరువు సమస్య ఉన్నవారు డబుల్ టోన్డ్ మిల్క్ తాగొచ్చు.

ఆవు పాలే మేలు

మన ఆరోగ్యానికి గేదె పాల కంటే ఆవు పాలే ఎంతో శ్రేయస్కరం. మార్కెట్లో ఎ1,ఎ2 రకం ఆవు పాలు లభిస్తున్నాయి. దేశానికి చెందిన ఒంగోలు, గిర్ మొదలైన జాతులు ఇచ్చే పాలను ఎ2 రకం. దేశానికి చెందిన జాతి ఆవులకు జెర్సీ ఆవులకు క్రాస్ బ్రీడింగ్‌లో చేయగా పుట్టిన ఆవులిచ్చే పాలను ఎ1 రకమని అంటారు. ఆరోగ్య విషయంలో ఎ2 రకం పాలే మంచిదని నిపుణలు చెబుతున్నారు.

కల్తీ పాలు

మన దేశంలో లభించే 68 శాతం పాల ఉత్పత్తులు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించిన ప్రమాణాలు పాటించడం లేదు. మార్కెట్లో కల్తీ పాల గురించి తరచూ వింటూనే ఉన్నాం. కల్తీ పాల తయారీలో వంట సోడా, డిటర్జెంట్, గ్లూకోజ్ పౌడర్, రిఫైన్డ్ ఆయిల్, వైట్ పెయింట్ మొదలైనవి వాడుతున్నారు. వీటి వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పేలా లేదు. ప్యాకెట్ పాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related News

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

Big Stories

×