BigTV English

Bhavishyavani 2023: భవిష్యవాణి నిజమవుతుందా? 2023లో విపత్తులు పొంచివున్నాయా?

Bhavishyavani 2023: భవిష్యవాణి నిజమవుతుందా? 2023లో విపత్తులు పొంచివున్నాయా?

Bhavishyavani 2023: భవిష్యవాణి, జోస్యం… నిజమవుతాయా? కాదా? అనేది చెప్పడం కష్టమే. కానీ వీటిని చాలా మంది విశ్వసిస్తుంటారు. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం 2023 రాబోతోంది. కొత్త ఏడాది ఎలా ఉండబోతోంది? ఇది తెలుసుకోవాలని చాలామంది ఆరాటపడుతుంటారు. ఈ నేపథ్యంలో బాబా వాంగ భవిష్యవాణి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం.
బాబా వాంగ నోట బయోవెపెన్స్ మాట :
కరోనాతో ప్రపంచం నాశనమైంది. దీన్ని బయోవెపన్ గా చాలామంది ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు. ఇక ప్రపంచంలోని పెద్ద దేశంగా గుర్తింపు పొందిన ఓ దేశం… బయోవెపన్స్ ను జనంపై పరీక్షిస్తుందని బాబా వాంగ చెప్పారట. దీనివల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారట.
బాబా వాంగ చెప్పిన మరో భవిష్యవాణి అణు విస్పోటనం:
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో అణుబాంబులు వాడుతారేమోననే భయం ఇప్పటికీ జనాన్ని వెంటాడుతోంది. దీని సంగతి ఎలా ఉన్నా 2023లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ విస్పోటనం చెందుతుందట. ఫలితంగా ముప్పు తప్పదట. బాబా వాంగ చెప్పిన భవిష్యవాణి ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో నిజమవుతుందా అనే అనుమానాలు లేకపోలేదు.
సహజంగా సంతానం కనరట… భవిష్యత్తంతా ల్యాబ్ బేబీస్ దేనట? :
బాబా వాంగ చెప్పినట్లు ప్రచారం జరుగుతున్న భవిష్యవాణిలో మరో కీలకమైన అంశం ల్యాబ్ బేబీస్. సహజంగా పిల్లలను కనడం ఆపేసి ల్యాబ్ బేబీస్ పై ఆసక్తి చూపుతారనేది దీని సారాంశం. ఎలాంటి పిల్లలను కనాలనేది తల్లిదండ్రుల ఇష్టాఇష్టాల పైకంటే ప్రపంచాధినేతలు, డాక్టర్లపైనే ఆధారపడుతుందట. అయితే పిల్లల కంటి రంగు, జుట్టు రంగును పేరెంట్స్ ముందుగా నిర్ణయించడానికి వీలవుతుందట. నిజానికి డిజైనింగ్ బేబీస్ టెక్నాలజీ వచ్చేస్తోందంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాబా వాంగ చెప్పిన భవిష్యవాణికి దీనికి మరింత దగ్గరగా ఉందంటున్నారు.
ప్రకృతి ప్రకోపం తప్పదా?
ప్రకృతి విపత్తులు రావడం కొత్తకాదు. కానీ భవిష్యత్తులు ఇవి మరింతగా విరుచుకుపడతాయట. భూమి తన కక్ష్యను మార్చుకోనుండడంతోనే విపత్తులు విరుచుకుపడతాయని బాబా వాంగ తన భవిష్యవాణిలో చెప్పినట్లు న్యూస్ వైరల్ అవుతోంది. వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందట. సౌర తుఫాను వచ్చి ఇప్పటిదాకా నిర్మించుకున్న సాంకేతిక సామ్రాజ్యాన్ని కూలదోస్తుందట. ఫలితంగా ప్రజలకు ఇబ్బందులు తప్పకపోవచ్చనేది బాబా వాంగ భవిష్యవాణిగా చెబుతున్నారు.
మరి బాబా వాంగ భవిష్యవాణికి ప్రపంచం ఎందుకు భయపడుతోంది? దీనికి కారణం లేకపోలేదంటారు. ఆమె చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. 9/11 టెర్రరిస్టుల దాడి గురించి ఆమె ముందుగానే అంచనా వేశారు. ఇక బల్గేరియాలో జన్మించిన బాబా వాంగ 12 ఏళ్లకే కళ్లను కోల్పోయారు. ఇప్పటికే ఈమె చెప్పిన భవిష్యవాణిలో చాలావిషయాలు నిజమవ్వడంతో 2023లో కూడా ఆమె జోస్యం నిజమయితే కష్టనష్టాలు తప్పవంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×