Black Hole: భూమికి అత్యంత దూరంలో అతిపెద్ద బ్లాక్ హోల్ గుర్తింపు..

Black Hole: భూమికి అత్యంత దూరంలో అతిపెద్ద బ్లాక్ హోల్ గుర్తింపు..

Black Hole: భూమికి అత్యంత దూరంలో అతిపెద్ద బ్లాక్ హోల్ గుర్తింపు..
Share this post with your friends

Black Hole: అంతరిక్షంలో ఉన్న మిస్టరీలు కనిపెట్టే విషయంలో కూడా దేశాల మధ్య పోటీ పెరిగిపోయింది. ఏ దేశం ముందుగా అంతరిక్షంలోని సీక్రెట్స్‌ను కనిపెడుతుంది, ఏ ఆస్ట్రానాట్ స్టడీ సక్సెస్ అవుతుంది అనేదానిపై ఫుల్‌గా ఫోకస్ పెట్టారు. తాజాగా న్యూయార్క్‌లోని రాంచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ఎవరూ కనిపెట్టని ఒక కొత్త బ్లాక్ హోల్‌ను కనిపెట్టారు. అది కూడా భూమికి అత్యధికమైన దూరంలో ఉందని వారు చెప్తున్నారు.

ఇప్పటికే భూమికి దగ్గరగా ఉన్న ఎన్నో అతిపెద్ద బ్లాక్ హోల్స్‌ను, దాని వల్ల భూమిపై పడే ప్రభావాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ విషయంలో ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ తాజాగా అసలు భూమికి దరిదాపుల్లో కూడా లేని బ్లాక్ హోల్‌ను న్యూయార్క్ శాస్త్రవేత్తలు గుర్తించారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఇది సాధ్యమయిందని వారు చెప్తున్నారు. ఈ శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ప్రపంచం ఫార్మ్ అయినప్పుడు ఏర్పడిన గ్యాలక్సీలను, ఎన్నో బ్లాక్ హోల్స్‌ను కనిపెట్టారు.

ఎర్లీ యూనివర్స్‌లో బ్లాక్ హోల్స్, గ్యాలక్సీలు అనేవి ఎలా ఏర్పడేవి, ఎలా ఉండేవి అనే విషయంలో ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా వారు కనిపెట్టిన బ్లాక్ హోల్ కూడా ఈ పరిశోధనల్లో భాగంకానుంది. కాస్మిక్ హిస్టరీలోని ఒక కాలాన్ని ఈ బ్లాక్ హోల్ మనకు తెలిసేలా చేస్తుందని, కానీ అసలు అది ఏ కాలమని ఇంకా కనిపెట్టాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ బ్లాక్ హోల్ ఉన్న గ్యాలక్సీని శాస్త్రవేత్తలు కనిపెట్టి అయిదు సంవత్సరాలు అయినా ఈ బ్లాక్ హోల్ మాత్రం ఇప్పుడే బయటపడిందని తెలిపారు.

తాజాగా శాస్త్రవేత్తలు కనిపెట్టిన బ్లాక్ హోల్ పేరు సీర్స్ 1019 అని తెలుస్తోంది. చాలావరకు టెలిస్కోప్‌లకు అందని వేవ్‌లెన్త్స్‌ను చేరుకోవడానికి ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తయారు చేయబడింది. అందుకే దీని సాయంతో ఇప్పటివరకు ఈ టెలిస్కోప్‌కు కనిపించని ఈ బ్లాక్ హోల్‌ను కనిపెట్టగలిగామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ టెలిస్కోప్.. సీర్స్‌కు సంబంధించి కొన్ని ఇమేజెస్‌ను విడుదల చేసినా కూడా ఇంత దూరం నుండి అవి స్పష్టంగా కనిపించడం లేదని వారు తెలిపారు. చాలా దూరంలో ఉంది కాబట్టి దీని గురించి తెలుసుకోవడానికి మరికాస్త సమయం పడుతుందని అంటున్నారు.

బిగ్ బ్యాంగ్ జరిగిన దాదాపు 570 మిలియన్ సంవత్సరాల తర్వాత సీర్స్ బ్లాక్ హోల్ అనేది ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది ఇప్పటికీ యాక్టివ్‌గానే ఉందని వారు చెప్తున్నారు. యాక్టివ్‌గా ఉండడం మాత్రమే కాకుండా ఈ బ్లాక్ హోల్ సైజ్ కూడా వారిని ఆశ్చర్యపరుస్తుందని అంటున్నారు. ఈ బ్లాక్ హోల్ దాదాపు 9 మిలియన్ సోలార్ మాస్‌లకు సమానంగా ఉందని చెప్తున్నారు. ఈ కాస్మిక్ టైమ్‌లో ఉన్న బ్లాక్ హోల్స్ అన్నింటితో పోలిస్తే ఇది చాలా పెద్దదని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Hong Kong Fashion Show: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దుస్తుల్లో మోడల్స్ మెరుపులు

Bigtv Digital

Hrithik Roshan : నటితో రెండో పెళ్లికి సిద్ధమయిన బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో.

Bigtv Digital

Love Marriage: పెద్దలు ఒప్పుకోలేదని.. ప్రేమకు వేదికైన కాలేజీలో పెళ్లి చేసుకున్న జంట

Bigtv Digital

Dangerous Odors :- గాలిలోని హానికరమైన వాసనలను తొలగించే టెక్నాలజీ..

Bigtv Digital

Infertility in Men : ఇన్‌ఫెర్టైల్ మగవారికి కూడా సంతానం కలిగే ఛాన్స్.. ఎలాగంటే..?

Bigtv Digital

Tuesday: మంగళవారం నాడు శుభకార్యాలు చేయకూడదా…

Bigtv Digital

Leave a Comment