BigTV English

Threads: ‘థ్రెడ్స్‌’పై చట్టపరంగా చర్యలు.. మస్క్ వార్నింగ్..

Threads: ‘థ్రెడ్స్‌’పై చట్టపరంగా చర్యలు.. మస్క్ వార్నింగ్..

Threads: మెటా అనేది సోషల్ మీడియా యాప్స్‌నే ఒక గూటికి చేర్చే ప్రపంచంగా మారిపోయింది. ఇప్పటికే ప్రముఖ సోషల్ మీడియా యాప్స్ అన్నీ మెటా ఆధ్వర్యంలోనే ఉన్నాయి. ఒక్క ట్విటర్ తప్పా. ట్విటర్‌ను సొంతం చేసుకోవాలి అనుకున్నా కూడా మెటా ఫౌండర్ మార్క్ జుకెర్బర్గ్‌కు అది అసాధ్యమైన విషయమే. అందుకే దానిని పోలి ఉండే మరో యాప్‌ను తయారు చేశాడు. అదే ‘థ్రెడ్స్’. ఈ యాప్ ఐడియా నచ్చని ఎలన్ మస్క్.. మెటాపై బెదిరింపులు మొదలుపెట్టాడు.


ట్విటర్ అనేది ఎలన్ మస్క్ చేతుల్లోకి వచ్చిన తర్వాత అందులో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కానీ అందులో చాలావరకు మార్పులు యూజర్లకు నచ్చడం లేదు. దాని వల్ల ఈ యాప్‌పై నెగిటివిటీ పెరిగిపోయింది. అయినా కూడా యూజర్ల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. అలా ట్విటర్‌లో వస్తున్న చాలావరకు అప్డేట్స్‌ను ఉన్నది ఉన్నట్టుగా తన యాప్స్‌లో అప్డేట్ చేస్తున్నాడు మార్క్. ట్విటర్‌లో పెయిడ్ సబ్‌స్క్రైబర్స్‌ అప్డేట్‌ను చూసి ఇన్‌స్టాగ్రామ్‌లో అలాంటిదే తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏకంగా ట్విటర్‌ను పోలిన యాప్‌నే లాంచ్ చేశాడు.

మార్క్ క్రియేట్ చేసిన ‘థ్రెడ్స్’ యాప్ అనేక కాంట్రవర్సీల మధ్య లాంచ్ అయ్యింది. అయినా అవేవి పట్టించుకోకుండా యూజర్లు.. అప్పుడే థ్రెడ్స్‌లో అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. కానీ థ్రెడ్స్ అచ్చం ట్విటర్‌లాగా ఉంది అనే కామెంట్స్ మాత్రం ఆగలేదు. దీంతో ఎలన్ మస్క్ ఆగ్రహానికి గురయ్యాడు. ట్విటర్ నుండి వెళ్లిపోయిన ఉద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి.. ట్విటర్ ట్రేడ్ సీక్రెట్స్‌ను కొట్టేశాడంటూ మార్క్‌పై కేసు పెట్టే ఆలోచనలో ఉన్నాడు. దీనికి సంబంధించిన లెటర్‌ను మస్క్ అటార్ని మార్క్‌కు పంపించాడు కూడా.


దీనికోసమే అలెక్స్ స్పిరో అనే లాయర్‌ను ఎలన్ మస్క్ హైర్ చేసుకున్నాడు. మెటా కావాలనే ట్విటర్ ట్రేడ్ సీక్రెట్స్‌ను కాజేసింది అంటూ అలెక్స్.. మార్క్‌కు లెటర్‌ను పంపించాడు. ప్రస్తుతం ఈ లెటర్ గురించి రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ రూమర్స్ గురించి మస్క్.. ప్రత్యక్ష్యంగా కాకపోయినా పరోక్షంగా స్పందించాడు. ‘పోటీ ఓకే కానీ చీటింగ్ నాట్ ఓకే’ అంటూ ట్వీట్ చేశాడు. ట్విటర్ నుండి బయటికి వెళ్లిపోయిన ఉద్యోగుల దగ్గర ట్విటర్‌కు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉన్నాయని లాయన్ పంపిన లెటర్‌లో పేర్కొన్నాడు.

ఈ లెటర్ గురించి మెటా స్పోక్స్‌పర్సన్ ఆండీ స్టోన్ స్పందించారు. థ్రెడ్స్ టీమ్‌లో పనిచేస్తున్న ఏ ఉద్యోగి కూడా ట్విటర్ నుండి రాలేదని స్పష్టంగా తెలియజేశాడు. థ్రెడ్స్‌పై లీగల్‌గా కేసు పెడతానని ట్విటర్ చెప్పకపోయినా.. మస్క్ మాత్రం ఈ విషయంలో చాలా ఆగ్రహంతో ఉన్నాడని సమాచారం. థ్రెడ్స్ లాంచ్ అయిన మొదటి రోజే 30 మిలియన్ మంది యూజర్లు ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కూడా మస్క్ ఆగ్రహానికి కారణం. దీంతో ట్విటర్ వర్సెస్ థ్రెడ్స్ అనే పోటీ చాలారోజులు హాట్ టాపిక్‌గా మారనుందని యూజర్లు భావిస్తున్నారు.

Related News

Gautami Chowdary: గౌతమ్‌ చౌదరికి అంబర్‌పెట్‌ శంకర్‌ మద్దతు.. లైవ్‌లో అసలు నిజం బట్టబయలు..

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

Big Stories

×