Big Stories

Breakfast :- టిఫిన్ చేశాక పూజ ఎందుకు చేయకూడదు?

- Advertisement -

Breakfast :- పూజ చేయాలంటే నియమంగా నిష్టంగా ఉండాలంటారు. ఉదయాన్నే స్నానం చేసి ఇంటిని శుద్ధి చేసుకుని భగవంతుడ్ని పూజించాలంటారు. మరికొందరు మడి కట్టుకుని పూజ చేస్తుంటారు . అలాచేస్తే పవిత్రత కలుగుతుందని సెలవిస్తుంటారు. పూజలంటేనే భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. కొందరూ దేవుడ్ని కూడా జడుసుకునేలా పూజలు చేస్తుంటారు. కానీ అలా చేయకూడదు. చిత్తశుద్ధి లేని శివపూజలేలరా..ఆత్మశుద్ధి లేని ఆచారమేలరా అని ఎనాడో వేమన ప్రశ్నించాడు. అల్పాహారం చేసి పూజ చేస్తే దేవుడు శపిస్తాడా…తన భక్తుల్ని శిక్షిస్తాడా అని కొందరు ప్రశ్నిస్తుంటారు. టిఫిన్ చేసి పూజచేస్తే దేవుడు వరాలివ్వడం మానేస్తారా అని కొందరు వెటకారం కూడా చేస్తుంటారు.

- Advertisement -

తిరుమలసహా అనేక దేవాయాల్లో స్వామికి లేవగానే చేసే సేవలు పరిశీలిస్తే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. తిరుమలేశుడికి ఉదయాన్నే వెన్నపూస నైవేద్యం పెడతారు. ఆ మాటకొస్తే తెల్లవారజామున నాలుగు గంటలకే నైవేద్యం పెడుతుంటారు. భూపాలరాగం వినిపించి వెన్నెపూస పెడతారు. బాలభోగం పేరుతో స్వామికి పెరుగన్న నైవేద్యంగా సమర్పిచడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. నిద్రలేవగానే వెన్నపూస, తర్వాత పెరుగన్నం,పులిహార నైవేద్యం ఇలా స్వామివారికి వేర్వేరుగా ప్రసాదాలను సమర్పిస్తుంటారు. ఏ ఆలయానికి వెళ్లినా ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి.

నేటి రోజుల్లో మనిషి మందులు లేకుండా బతకలేని పరిస్థితి. మందులతో శరీరాన్ని నింపుకుంటున్నారు. మాటలతో మనుషుల్ని మన దగ్గరకు చేర్చుకునే శక్తి ఉంది. అలాంటి పని జరగాలంటే ముందు కడుపులో ఏదో ఒకటి పడాలి. మాట బలంగా ఉత్సాహంగా రావాలంటే శరీరానికి శక్తి కావాలి. మన మీదకు మనకు నియంత్రణ కోల్పోయినప్పుడు రోగాలు ఒంటిని తాకడం మొదలవుతుంది. శరీరం సహకరించినప్పుడు ఉపవాసం చేయడం సబబే. ఆహారం ద్వారా బలం శరీరానికి అందాలి. తినే పదార్ధం మనస్సుకి బలాన్ని ఇచ్చేది కావాలి. ఆత్మశక్తిని కలిగిస్తున్నాననే ధ్యాసతో తినాలి. శరీరం పడిపోయే స్థితిలో తినొద్దని అని ఏ దేవుడు చెప్పడు అన్న సంగతి గుర్తించుకోవాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News