Big Stories

Jamalapuram :- సూది లాంటి పర్వతంపై వెలిసిన వెంకటేశ్వరుడు

- Advertisement -

Jamalapuram :- ఖమ్మం జిల్లాలోని జమలాపురం వెంకటేశ్వరుడికి ఒక ప్రత్యేకత ఉంది సూదిలా ఉన్న పర్వంపై ఇక్కడ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెలిశాడు. జాబిలి మహర్షి తపస్సు వల్ల ఆ స్వామి ఈ క్షేత్రంలో కొలువు దీరాడని స్థానికులు చెబుతుంటారు. గతంలో ఈ ప్రాంతాన్ని సూచిగిరిగా పిలిచే వారు. నిటారుగా ఉంటుంది ఇక్కడి కొండ ప్రాంతం. ఈ కొండపై రెండు గుహలున్నాయి. జాబాలి మహర్షి తపస్సుకి మెచ్చి శ్రీహరి ఒక గుహలో స్వయంభూ వెంకటేశ్వరస్వామిగా వెలిశాడు. శ్రీహరి వెలిసిన గుహ కావడంతో అది వైకుంఠ గుహగా మారింది.

- Advertisement -

కలియుగం ప్రారంభం రోజున వేంకటేశ్వరుడి రూపంలో ఇక్కడ ఉద్భవిస్తానని శ్రీరాముడు చెప్పాడు. ఇచ్చిన మాట ప్రకారంగానే సాలగ్రామ రూపంలో కలియుగం ప్రారంభం రోజున వెలిశాడు. అందువల్ల ఇక్కడ ఉన్న వేంకటేశ్వరుడి విగ్రహం తిరుమలేశుడి ప్రతిమ కంటే పురాతనమైనదిగా చెబుతుంటారు. మహిమ గల ఈ దేవుడ్ని సందర్శించుకొన్నవారి గృహాల్లో రామరాజ్యం మాదిరిగా నిత్యం సుఖ సంతోషాలు వెలివిరుస్తాయని నమ్మకం. స్వామి చలువతో ఐశ్వర్య వృద్ధి కూడా జరుగుతుందని స్థానికులు బలంగా విశ్వసిస్తుంటారు.

జమలాపురాన్ని తెలంగాణ తిరుపతి అని కూడా అంటారు. ఏడుకొండలు ఎక్కి రాలేని వారి కోసం దేవుడు దిగి వచ్చిన ఊరే జమలాపురం వెంకటేశ్వర స్వామి. పద్మావతి అమ్మవారు, శ్రీ అలమేలు మంగమ్మతదితర ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని విజయనగర మహారాజు శ్రీ కృష్ణ దేవరాయలు పునరుద్ధరించారు. ఈ ఆలయానికి చేరుకునేందుకు రైలుతోపాటు బస్సు మార్గాలు ఉన్నాయి. విజయవాడ నుంచి ఈ ప్రాంతానికి సులభంగా చేరుకోవచ్చు. ముక్కోటి ఏకాదశ సమయంలో ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య విశేషంగా ఉంటుంది. తిరుమల వెళ్లలేని భక్తులు స్వామి దర్శనం కోసం ఇక్కడకే వస్తుంటారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News