BigTV English

Diabetic: షుగర్‌ ఉన్నవారు పాలు, పెరుగు తినవచ్చా?

Diabetic: షుగర్‌ ఉన్నవారు పాలు, పెరుగు తినవచ్చా?

Diabetic:ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా 80 శాతం మందిని ఇబ్బందులకు గురిచేస్తున్న సమస్య డయాబెటిస్. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు అధికంగా ఉండడాన్ని డయాబెటిస్ అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. టైప్ వన్ మధుమేహం వంశపారంపర్యంగా వస్తుంది. అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగా టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. డయాబెటిస్ వచ్చే ముందు ఉండే స్థితిని ప్రీ డయాబెటిస్ అంటారు. జస్టిషనల్ డయాబెటిస్ గర్భం దాల్చిన మహిళల్లో కొంతకాలం వరకు ఉంటుంది. కానీ టైప్-2, టైప్-2 డయాబెటిస్‌ అత్యంత ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. డయాబెటిస్ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే స్థూలకాయం, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు వస్తాయి. ఆ తర్వాత ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయి. రోజు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. ఇక డయాబెటిస్ ఉన్నవారు పాలు, పెరుగు తీసుకోవచ్చా అని చాలామందికి సందేహాలు వస్తుంటాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు పాలు, పెరుగు తీసుకోవచ్చని.. కాకపోతే కొవ్వు లేని వాటిని తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వెన్నతీయబడిన పాలు తాగవచ్చు. దాంతో తయారుచేసిన పెరుగు తినవచ్చు. శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది. పాలు, పెరుగులో ఉండే పోషకాలు, ప్రోటీన్లు డయాబెటిస్ ఉన్నవారికి చాలా మేలు చేస్తాయి. వెన్న తీసిన పాలను రోజుకు ఓ రెండు గ్లాసులు తాగితే మంచిది. అదే పెరుగు అయితే ఒక రెండు కప్పుల వరకు తీసుకోవచ్చు. అంతకుమించి తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. ఇక మజ్జిగ రూపంలో అయితే మూడు గ్లాసులు తాగవచ్చని అంటున్నారు. డయాబెటిస్ ఉన్నవారు జంక్ ఫుడ్, చెక్కర ఎక్కువగా ఉండే పదార్థాలు, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. ఫైబర్, ప్రోటీన్లు ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వు పదార్థాలను, పిండి పదార్థాలను తగ్గిస్తే మంచిది. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. మన రక్తంలోని చక్కర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×