Peacock Feathers : నెమలి ఈకల్ని గతంలో పుస్తకాల్లో పెట్టుకువారు.వాటికి మేత కూడా పెట్టేవారు. అది పిల్లలు పెడుతుందని అనేవారు. నెమలి కన్ను ఉన్న ఈకల్ని పెట్టుకుంటే చదువుబాగా వస్తుందని నమ్మకం. దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. నెమలి కన్నుల్ని ఇంట్లో పెట్టుకునే విషయంలో కొంతమందికి అనుమానాలుంటాయి. వారి కోసమే ఇదంతా. నెమలి కన్నులను ఇంట్లో పెట్టుకోవచ్చు.
నెమల్ని ఈకలతో పొట్టమీద రాసుకుంటే అజీర్ణ సంబంధ వ్యాధుల్ని పోగొడుతుంది. ఇటలీలో ఇలాంటివి ఎక్కువ కనిపిస్తుంటాయి. మనోళ్లు నెమలి ఈకలతోనే దిష్టి తీస్తుంటారు. ఇవి కొంతమంది నమ్మరు. కానీ నిజం. ఎందుకంటే నెమలి పింఛాన్ని ఎవరు ధరిస్తారో తెలుసు కదా శ్రీకృష్ణభగవానుడు. ఎంతమంది గోపికలు ఉన్నా ఆయన బ్రహ్మచారిగానే బతికారు. నెమలి పింఛం ధరించడానికి కారణం అదే. కృష్ణుడు నెమలి పింఛం ధరించడం వల్లే పరీక్షితుడు బతికాడు.
సృష్టిలో ఒక్క నెమలి పక్షి మాత్రమే సంయోగం లేకుండా గర్భాన్ని ధరించి గుడ్లు పెట్టి పిల్లల్ని పెడుతుంది. మగనెమలి నాట్యం చేస్తుంటే దాని కంటి వెంట నీటి చుక్కలు రాలుతాయి. ఆ చుక్కలను ఆడ నెమలి వెళ్లి తాగి గర్భం ధరిస్తుంది. నెమలి బ్రహ్మచర్యానికి సంకేతంగా భావించాలి.కృష్ణ పరమాత్ముడికి అంతమంది భార్యలున్నా బ్రహ్మచర్యంలో ఉన్నాడు. బ్రహ్మచర్యానికి సంకేతం నెమలి కన్ను.
నెమలి కన్ను ఇంట్లో ఉండటం వల్ల రోగ నివారణ జరుగుతుంది. పిల్లలకు మంచి ఆలోచన కలిగి విద్యాప్రాప్తి లభిస్తుంది. ఇంట్లో వాళ్ల ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. అయితే బలవంతంగా చంపిన నెమలి ఈకలు ఈఫలితాలను ఇవ్వవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెమలి నాట్యం చేస్తున్నప్పుడు జారిపడ్డ నెమలి ఈకలు మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి. అందుకే నెమలి కన్నుల కట్ట అంత ఖరీదు ఉంటుంది. ఈవిషయాలను అటవీశాస్త్రంలోను చెప్పారు.
నెమలి ఈకల వల్ల ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లోకి రావని విశ్వాసం.
నెమలి పింఛాన్ని ఇంటి ఉత్తరం లేదా తూర్పులో దిశలో ఏదైనా మూలలో ఉంచండి. బయట నుంచి వచ్చే వ్యక్తి చూసేలా పెట్టండి. ప్రతీరోజు భగవంతుడ్ని ఆరాధించిన తర్వాత నెమలి పింఛంతో గాలి విసరండి ఈ సేవ చేయడం ద్వారా భగవంతుడు మీ కోరికలన్నింటిని నెరవేరుస్తాడు. పూజగదిలో కూడా నెమలి పింఛాన్ని తప్పకుండా ఉంచండి