E-Paper

DAV Public School : మళ్లీ తెరచుకోనున్న బంజారాహిల్స్‌ DAV పబ్లిక్ స్కూల్..

DAV Public School : మళ్లీ తెరచుకోనున్న బంజారాహిల్స్‌ DAV పబ్లిక్ స్కూల్..

DAV Public School : హైదరాబాద్ బంజారాహిల్స్ లోని DAV పబ్లిక్ స్కూల్ అనుమతిని తెలంగాణ విద్యాశాఖ పునరుద్ధరించింది. కేవలం ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే తాత్కాలిక అనుమతి ఇస్తున్నామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
అసలే జరిగింది?
ఈ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. ఈ కేసులో డ్రైవర్ రజినీకుమార్, ప్రిన్సిపల్ మాధవిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ పాఠశాల గుర్తింపును విద్యాశాఖ రద్దు చేసింది. విద్యా సంవత్సరం నష్టపోకుండా సమీపంలోని స్కూళ్లలో విద్యార్థులను సర్దుబాటు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డీఈవోను ఆదేశించారు. అయితే ఈ స్కూల్ లో చదువుతున్న విద్యార్ధుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.

తల్లిదండ్రుల ఆందోళన.. స్కూల్ గుర్తింపు రద్దు తర్వాత విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత డీఈవోదేనని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. విద్యాశాఖ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పటికిప్పుడు పాఠశాల గుర్తింపును రద్దు చేస్తే తమ పిల్లలను ఎక్కడికి పంపించాలని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 700 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యాసంవత్సరం వరకు పాఠశాల గుర్తింపును కొనసాగించాలని నిర్ణయించింది.

Related News

హైదరాబాద్ భారీ వర్షం .. పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

×