నటి, ఎమ్మెల్యే రోజాపై తనదైన శైలిలో సుతి మెత్తగా కామెంట్స్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడుతూ మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌లు ఎవరికీ సాయం చేయలేదని, అందుకనే సొంత నియోజక వర్గంలో ప్రజలు వారిని ఓడించారని కామెంట్స్ చేశారు. అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీనిపై రీసెంట్ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి కౌంటర్ ఇచ్చారు. ‘‘నా పేరు వాడకపోతే వారికి గుర్తింపు రాదు.. వారి మాటలను ఎవరూ పట్టించుకోరు.. తనకో గుర్తింపు కావాలి. అది కూడా అడ్డదిడ్డంగా కావాలంటే నా ఫ్యామిలీ మీద అడ్డదిడ్డంగా మాట్లాడాలి. ఆ రకంగా మాట్లాడి గుర్తింపు కావాలంటే ఇచ్చేయాలనిపిస్తుంది.
నాతో ఉండి.. నా స్నేహితులుగా ఉండి.. ఇలా మాట్లాడుతున్నారంటే.. అరే నిన్న మొన్న మా ఇంటికి వచ్చారు. ఇంత వరకు నేను ఎవరికీ సాయం చేయలేదా? నేను చేయలేదని నిరూపించమనండి. నేను ఎప్పుడూ పబ్లిసిటీ చేసుకోలేదు. నేను సాయం చేయలేదని అంటే నీకు అంతే తెలుసునని అనుకుంటాను. నేను ఎలాంటి సాయం చేశానని నాకు తెలుసు.. తీసుకున్న వారికి తెలుసు. మధ్యలో నీకు తెలిసే అన్నావో, తెలియక అన్నావో.. నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అలాంటి వాళ్లను పట్టించుకోను. ఈ సమయంలో నాకు మానసిక ప్రశాంతత ముఖ్యం. నువ్వేదో అన్నావని నేను ఎందుకు బాధపడాలి’’ అన్నారు.
చిరంజీవి హీరోగా రవితేజ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఆయన ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో బిజీగా ఉంటున్నారు.