Cancer : పూర్వం ఉదయం లేవగానే పళ్లు తోముకోవడానికి వేప, తంగేడు పుల్లలు ఉపయోగించేవారు. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా టూత్ పేస్ట్ దర్శనిమిస్తుంది. ఈ టూత్‌పేస్ట్ మన నోటి, దంతాలలోని సూక్ష్మక్రిములను చంపడంలో సహాయపడుతుంది. నోటి దుర్వాసనను తొలగించి నోటిని శుభ్రంగా, తాజాగా ఉంచుతుంది. కానీ సరైన టూత్ పేస్ట్ వాడకపోతే.. భయంకరమైన రోగాలు చుట్టుముట్టే అవకాశం ఉందని మీకు తెలుసా..? మీరు రోజూ వాడే టూత్ పేస్ట్‌లో క్యాన్సర్‌తో పాటు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు కలిగించే రసాయనాలు ఉంటాయని తెలుసా?
ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. క్యాన్సర్ రావడానికి అనేక కారణాలున్నా.. మనం తినే ఆహారాల నుంచి మనం ఉపయోగించే కొన్ని ఉత్పత్తుల వరకు ఏదైనా క్యాన్సర్‌కు కారణం కావచ్చు. వాటిలో ఒకటి టూత్‌పేస్ట్.
అవును.. పేస్టులలో వాడే కొన్ని కెమికల్స్ క్యాన్సర్ కారకాలుగా మారే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కెమికల్స్ చిగుళ్ల నుంచి రక్తంలో కలిసి నష్టాన్ని కలిగిస్తాయట. ఎలాంటి రసాయనాలు ఉన్న టూత్‌పేస్ట్‌లు కొనకూడదో ఇప్పుడు చూద్దాం.
ట్రైక్లోసన్ : ఇది ఒక యాంటీ మైక్రోబయల్ ఏజెంట్. బ్యాక్టీరియా, శిలీంధ్రాల పెరుగుదలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. దీనిని టూత్‌పేస్ట్ మొదలుకొని సబ్బులు, కాస్మొటిక్ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. కానీ ట్రైక్లోసన్ ఎక్కువకాలం ఉపయోగించడం వల్ల స్త్రీ సెక్స్ హార్మోన్ ఈస్ట్రోజెన్ నుండి థైరాయిడ్ హార్మోన్ల వరకు ప్రతిదానిని ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో శరీర వ్యవస్థలు సరిగ్గా పనిచేయక దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. కాబట్టి ఈ కెమికల్ ఉన్న టూత్‌పేస్ట్‌ను వాడొద్దు.
ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్లు : టూత్‌పేస్ట్‌లో తియ్యని టేస్ట్ రావడానికి సాచరిన్ వంటి స్వీట్‌నర్లను ఉపయోగిస్తారు. ఇవి అధికంగా వాడితే క్యాన్సర్ ముప్పు ఉండొచ్చని Nutrinet Sante అధ్యయనం వెల్లడించింది. అయితే అందుకు పక్కా ఆధారాలు లేవు. అలానే టూత్‌పేస్ట్‌లో తీపి కోసం వాడే అస్పర్టేమ్ అనే పదార్థం పేగుల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలకు అంతరాయం కలిగించి, ఇన్సులిన్ సమస్యలకు దారితీస్తుంది.
పారాబెన్స్ : ఇది పేస్ట్‌తో సహా వివిధ కాస్మెటిక్ ఉత్పత్తుల జీవితాన్ని పొడిగించడానికి పారాబెన్‌లను ఉపయోగిస్తారు. ఇవి ఈస్ట్రోజెన్ పనితీరును దెబ్బతీస్తాయి. రొమ్ము క్యాన్సర్‌కు కారణం కావచ్చనే సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఈ పారాబెన్ అధికంగా ఉండే టూత్‌పేస్ట్‌లను ఉపయోగించకుండా ఉండటం మంచిని నిపుణులు చెబుతున్నారు.
డైథనోలమైన్ (DEA) : ఇది టూత్ పేస్ట్‌లో నురగను సృష్టిస్తుంది. జంతువులకు వర్తించే ఇథనోలమైన్‌లు క్యాన్సర్‌కు కారణమవుతాయని 1998లో National Toxicology Program ఒక అధ్యయనంలో తెలిపింది. మోతాదుకు మించిన డైథనోలమైన్ లివర్, కిడ్నీలపై ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందని అనుమానాలు ఉన్నాయి.