Shoaib Akhtar On His Health: పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ గురించి తెలియని వారు ఉండరు. రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరు తెచ్చుకున్న షోయబ్ అక్తర్, గంటకు 150 కిలో మీటర్ల వేగంతో బంతులు సంధిస్తాడు. అయితే అలాంటి షోయబ్ అక్తర్ జీవితంలో కూడా కొన్ని చీకటి కోణాలు ఉన్నాయి. ఆరేళ్ల వయసులోనే షోయబ్ అక్తర్ చనిపోతాడని అందరూ హేళన చేశారట. ఆరు సంవత్సరాల వయసులోనే చనిపోతాడని కూడా అనుకున్నారట. కానీ చావును సైతం జయించి.. అంగ వైకల్యాన్ని నేలకేసి కొట్టి మరీ స్టార్ అయ్యాడు షోయబ్ అక్తర్. తన చిన్నప్పుడు జరిగిన అవమానాలను షోయబ్ అక్తర్ పంచుకున్నారు. ఎన్నో అవమానాలు, చావును ఎదురించి, ఈ స్థాయికి వచ్చినట్టు షాకింగ్ నిజాలు బయట పెట్టారు.
తన అంగ వైకల్యం గురించి, కుటుంబ సమస్యలపై కీలక విషయాలను షోయబ్ అక్తర్ పంచుకున్నారు.
తన కంటే ముందు అన్నయ్య పుట్టి చనిపోయాడని షోయబ్ అక్తర్ వెల్లడించారు. అతడు పుట్టగానే తన తల్లి ఎంతో సంబరపడి షోయబ్ అనే పేరు పెట్టిందని వ్యాఖ్యానించారు. ఈ పేరు పెట్టగానే తన అన్నయ్య మృతి చెందినట్టు వివరించారు. దీంతో తన తల్లి ఎంతో బాధపడిందని ఎమోషనల్ అయ్యారు. మళ్లీ తనకు కొడుకు పుడితే షోయబ్ అనే పేరు పెట్టుకోవాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అయితే ఆ పేరు పెడితే పుట్టబోయే బిడ్డ అంగవైకల్యంతో పుడతాడని ఇంట్లో వాళ్ళు తన తల్లిని బెదిరించినట్లు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ తన తల్లి ఎవరి మాట వినలేదని గుర్తు చేశారు.
ఈ క్రమంలో తాను అంగవైకల్యంతోనే జన్మించినట్లు షోయబ్ అక్తర్ తెలిపారు. దీంతో తాను ఆరు సంవత్సరాల వరకు నడవలేకపోయానని.. పాక్కుంటూ మాత్రమే ముందుకు వెళ్లే వాడిని వెల్లడించారు. దీంతో తాను చనిపోతానని కూడా కొంత మంది తన తల్లిని బాధపెట్టారని గుర్తు చేశారు. 9 ఏళ్ల వయసు వచ్చే వరకు ఇవే అవమానాలను తన కుటుంబం ఎదుర్కొందని చెప్పుకొచ్చారు. ఇరుగు పొరుగు వాళ్ళ అవమానాలతో.. సూసైడ్ చేసుకోవాలని అనిపించినట్లు షాకింగ్ నిజాలను షోయబ్ అక్తర్ పంచుకున్నారు. కానీ వాటన్నిటిని దిగమింగుకొని… పరిగెత్తడం మొదలు పెట్టినట్లు తెలిపారు. ఆ తర్వాత తాను క్రికెట్లోకి వచ్చి ఎన్నో రికార్డులు సృష్టించినట్లు పేర్కొన్నారు. దీంతో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన కీలక వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.