BigTV English

Chatgpt: ఆటోమొబైల్ రంగంలో చాట్‌జీపీటీ.. ఉపయోగాలు ఏంటంటే..?

Chatgpt: ఆటోమొబైల్ రంగంలో చాట్‌జీపీటీ.. ఉపయోగాలు ఏంటంటే..?

Chatgpt: చాట్‌జీపీటీ అనేది ఎన్నో రంగాల్లో ఎన్నో మార్పులను తీసుకువచ్చింది. ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో కూడా మార్పులు తీసుకువచ్చే సత్తా ఈ ఓపెన్ఏఐ టెక్నాలజీకి ఉంది. ఈ చాట్‌బోట్ సాయంతో ఆటోమొబైల్ సంస్థలు పలు ఏరియాల్లో మార్పులు తీసుకురాగలరు. దీని వల్ల పర్యావరణానికి హాని లేకుండా వాహనాలు తయారు చేయడం దగ్గర నుండి కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరిచే వరకు ఎన్నో మార్పులు సాధ్యమవుతాయని నిపుణులు చెప్తున్నారు.


ఈరోజుల్లో మనిషికి సాయంగా ఉండడం కోసం టెక్నాలజీ అనేది ఎన్నో రూపాలను మార్చుకుంటోంది. అందులో వర్చువల్ అసిస్టెంట్స్ కూడా ఒకరు. ఒకప్పుడు మనుషులను అసిస్ట్ చేయడానికి మనుషులు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు వర్చువల్ అసిస్టెంట్స్ మనుషులకు సాయంగా ఉంటున్నాయి. అలాగే ఆటోమొబైల్ కంపెనీల్లో కూడా కస్టమర్లకు సమాధానాలు ఇచ్చేందుకు వర్చువల్ అసిస్టెంట్‌గా చాట్‌జీపీటీ పనిచేయగలదు.

ఏ రంగం అయినా కూడా లాభాలు తెచ్చుకోవాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా పూర్తిగా సేల్స్, మార్కెటింగ్‌పైనే ఆధారపడతాయి. చాట్‌జీపీటీ సాయంతో ఆటోమొబైల్ రంగంలోని సేల్స్, మార్కెటింగ్ రూపురేఖలనే మార్చేయవచ్చు అంటున్నారు నిపుణులు. సేల్స్ క్యాంపెయిన్‌లో పాల్గొని చాట్‌జీపీటీ అనేది ఒక వర్చువల్ అసిస్టెంట్‌గా కస్టమర్లకు సలహాలు, సూచనలు ఇవ్వగలదు. పైగా చాట్‌జీపీటీ టెక్నాలజీ అనేది ఎక్కువశాతం కరెక్ట్ సమాధానాలే ఇస్తుంది కాబట్టి కస్టమర్లతో త్వరంగా ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఈ టెక్నాలజీ సులభంగా ఉంటుంది.


ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే ఎన్నో లగ్జరీ కార్ల సంస్థలు సైతం పూర్తిగా వీటి తయారీపై దృష్టిపెట్టాయి. అందులోనూ ఏఐ లాంటి టెక్నాలజీ సాయంతో వీటి తయారీ మరింత సులభంగా మారుతుంది అని కొన్ని కంపెనీలు నమ్మడం మొదలుపెట్టాయి. అందుకే బెంజ్ లాంటి లగ్జరీ కార్ల సంస్థ కూడా ఏఐ సాయం తీసుకుంటోంది. ఇక ఇదే తోవలో చాట్‌జీపీటీని ఉపయోగించడం మొదలుపెట్టినా కూడా కార్ల తయారీ దగ్గర నుండి మార్కెటింగ్ వల్ల అన్ని విషయాల్లో ఉద్యోగులకు తోడుగా ఉంటుందని సంస్థలు భావిస్తున్నాయి. అందుకే నిపుణులు సైతం ఆటోమొబైల్ రంగంలో చాట్‌జీపీటీ తోడు మంచిది అని సలహా ఇస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×