BigTV English

Pawan Kalyan: ‘క్లాస్ వార్‌’పై జగన్‌కు ఫుల్ క్లాస్.. మద్యం రేట్లు తగ్గిస్తామన్న జనసేనాని..

Pawan Kalyan: ‘క్లాస్ వార్‌’పై జగన్‌కు ఫుల్ క్లాస్.. మద్యం రేట్లు తగ్గిస్తామన్న జనసేనాని..
pawan kalyan speech

Pawan Kalyan: క్లాస్ వార్. సీఎం జగన్ తరుచూ వాడుతున్న పదం. ఏపీలో క్లాస్ వార్ జరుగుతోందంటూ.. పదే పదే ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ అధినేత. లేటెస్ట్‌గా భీమవరం, వారాహి సభలో జనసేనాని.. జగన్ అంటున్న క్లాస్ వార్‌పై ఫుల్ క్లాస్ ఇచ్చారు.


డబ్బు ఉన్నవారు, అధికారం ఉన్నవాళ్లు.. డబ్బు లేనివారిని, అధికారంలో లేనివారిని దోచుకోవడమే క్లాస్ వార్ అని డెఫినేషన్ చెప్పారు పవన్ కల్యాణ్. కొండపల్లి సీతారామయ్య, తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య..లాంటి వాళ్లకు మాత్రమే క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు ఉంటుందని అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య అసలు పేరు సుందరరామిరెడ్డి అని.. ఆయన తన పేరు నుంచి.. కులం పేరును తీసేశారని గుర్తు చేశారు. కులం పేరు తీసేయడానికి ఇష్టం లేని జగన్‌కు.. క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కులేదని మండిపడ్డారు.

అధికారంలోకి రాగానే ఇసుక తవ్వకాలపై నిషేధం విధించి.. వేలాది మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారని.. 32 మంది ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయ్యారని.. అలాంటి జగన్‌కు క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కే లేదన్నారు పవన్ కల్యాణ్. అధికారంలో లేని తాను క్లాస్ వార్ ఎలా చేస్తా ముఖ్యమంత్రి? అంటూ ప్రశ్నించారు జనసేనాని.


మద్యపాన నిషేధమంటూ మాటలు చెప్పి.. రేట్లు పెంచి.. కల్తీ మద్యం అమ్ముతూ.. సీఎం జగన్ లక్ష కోట్లు సంపాదించారని ఆరోపించారు పవన్. జనసేన అధికారంలోకి రాగానే.. పాత ధరలకే మద్యం అమ్ముతామని ప్రకటించారు. గీత కార్మిక కులాలకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. ఆడపడుచులు వాళ్ల ప్రాంతంలో మద్యం వద్దని నిర్ణయం తీసుకుంటే.. అక్కడ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు పవన్ కల్యాణ్.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×