BigTV English

Chemical release from gas stove : గ్యాస్ స్టవ్ నుండి కెమికల్ విడుదల.. లుకేమియా వచ్చే అవకాశం..

Chemical release from gas stove : గ్యాస్ స్టవ్ నుండి కెమికల్ విడుదల.. లుకేమియా వచ్చే అవకాశం..
Chemical release from gas stove


Chemical release from gas stove : గాలి కాలుష్యం అనేది కేవలం బయట మాత్రమే కాదు.. ఇంట్లో కూడా ప్రొడ్యూస్ అవ్వగలదు అని శాస్త్రవేత్తలు ఇప్పటికే నిర్ధారించారు. గ్యాస్ స్టవ్ లాంటి వాటి నుండి వచ్చే పొగ వల్ల, మంట వల్ల కూడా గాలి కాలుష్యం ఏర్పడుతుందని అన్నారు. దాంతో పాటు పలు ఆరోగ్య సమస్యలకు కూడా గ్యాస్ స్టవ్ అనేది కారణమవుతుందని బయటపెట్టారు. తాజాగా గ్యాస్ స్టవ్ ద్వారా కలిగే మరొక ఆరోగ్య సమస్య గురించి శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

ఇళ్లల్లోని గ్యాస్ స్టవ్‌ల ద్వారా ఇంట్లో బెంజీన్ లెవల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. గాలిలో బెంజీన్ పెరగడం వల్ల ల్యూకేమియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఇతర బ్లడ్ క్యాన్సర్‌లకు కూడా ఇది దారితీస్తుందని వారు తెలిపారు. ఇళ్లల్లో గ్యాస్ స్టవ్ కానీ, ఓవోన్ కానీ 350 డిగ్రీల కంటే ఎక్కువ ఫారెన్హీట్‌తో పనిచేస్తే ఇంట్లో బెంజీన్ లెవల్స్ పెరిగే అవకాశం ఉందని వారి పరిశోధనల్లో తేలింది. మామూలుగా బెంజీన్ అనేది పొగాకు నుండి విడుదలయ్యే పొగలో ఎక్కువగా ఉంటుందని అన్నారు.


గ్యాస్ స్టవ్ నుండి బయటికి వచ్చిన బెంజీన్ అనేది ఇంట్లోనే చాలాసేపటి వరకు ఉండగలదని శాస్త్రవేత్తలు అంటున్నారు. బెంజీన్ అనేది మంటల నుండి, వేడి వాతావరణం నుండి ఫార్మ్ అవుతుందని తెలిపారు. అలాగే గ్యాస్ స్టవ్ నుండి వచ్చే మంట వల్ల కూడా ఇది ఫార్మ్ అవుతుందన్నారు. బెంజీన్‌ను ఎప్పటికప్పుడు బయటికి పంపించాలంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ లాంటివి తప్పకుండా ఉపయోగించాలని సూచించారు. అయితే గ్యాస్ స్టవ్ నుండి ఓవెన్ నుండి బెంజీన్ అనేది అసలు ఎలా బయటికి వస్తుందో తెలుసుకోవడంపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు.

బెంజీన్ నుండి మాత్రమే కాకుండా గ్యాస్ స్టవ్ వల్ల ఏర్పడే ఇతర కాలుష్యాల నుండి, వాటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యల నుండి ఎలా జాగ్రత్తగా ఉండాలో శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గ్యాస్ స్టవ్ మీద పూర్తిగా ఆధారపడకుండా ఎలక్ట్రిక్ ఐటెమ్స్‌పై ఆధారపడడం మంచిదని చెప్తున్నారు. అంటే టీ కెటిల్స్, టోస్టర్, స్లో కుక్కర్స్ లాంటివి. పోర్టబుల్ కౌంటర్ టాప్స్‌ను ఉపయోగించడం కూడా దీనికి మంచి సొల్యూషన్ అని తెలిపారు. ఇంట్లో రెగ్యులర్‌గా ఉపయోగించే గ్యాస్ స్టవ్‌ల వల్ల కూడా సమస్యలు వస్తున్నాయని తెలిసి చాలామంది ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×