BigTV English

Chicken and Eggs Price: నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు

Chicken and Eggs Price: నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు

Chicken and Eggs Price: ప్రతిఏటా కార్తీక మాసంలో నాన్ వెజ్ కు గిరాకీ తగ్గడం మామూలే. నాన్ వెజ్ కొనుగోళ్లు తగ్గడం వల్ల.. ధరలు కూడా తగ్గుతాయి. గతేడాది కార్తీకమాసం పూర్తయిన కొద్దిరోజులకు చికెన్, ఫిష్, కోడిగుడ్ల ధరలు పెరిగాయి. వీకెండ్ లో మధ్యతరగతి కుటుంబమంతా కలిసి.. తినగలిగేది చికెన్. అలాంటి చికెన్ ధరలు కూడా పెరగడంతో.. నాన్ వెజ్ ప్రియులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చికెన్ తో పాటు గుడ్ల ధరలు కూడా పెరిగాయి.


ఈ ఏడాది జనవరిలో చికెన్ ధరలు కాస్త తగ్గాయి. జనవరి 2న కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ.221 విత్ స్కిన్ రూ.194గా విక్రయించాయి. ప్రస్తుతం కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ.152 ఉండగా.. విత్ స్కిన్ రూ.133గా ఉంది. అయితే ముందు సంక్రాంతి పండుగ ఉండటంతో ధరలు మళ్లీ పెరుగుతాయని అంటున్నారు విక్రయదారులు. ఇక గతవారం డజను గుడ్ల ధర రూ.84కు పెరగ్గా.. తాజాగా కోడిగుడ్ల ధరలు సైతం తగ్గాయి. డజన్ కోడిగుడ్ల ధర రూ. 69.84గా ఉంది. ఒక్కగుడ్డును హోల్ సేల్ సెంటర్లో రూ.5.82కు విక్రయిస్తున్నారు. ఈ ధరలు సంక్రాంతి వరకూ ఇలాగే ఉండాలని కొనుగోలుదారులు ఆశిస్తున్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×