E-Paper
Advertisement

మన సంస్కృతికి ప్రతిరూపం రామాయణ.. అల్లు అర్జున్ పోస్ట్ తో భారీ హైప్!

మన సంస్కృతికి ప్రతిరూపం రామాయణ.. అల్లు అర్జున్ పోస్ట్ తో భారీ హైప్!
Advertisement

Allu Arjun On Ramayana: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి(Nitesh Tiwari) దర్శకత్వంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor), సాయి పల్లవి (Sai Pallavi)జంటగా నటించిన చిత్రం రామాయణ(Ramayana). ఈ సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చస్తున్నారు. ఇక ఈ సినిమా మరికొన్ని గంటలలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినీ సెలబటీలు కూడా చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(Allu Arjun) సైతం రామాయణ టీం కి బెస్ట్ విషెస్ తెలియజేశారు.

మన సంస్కృతికి ప్రతిరూపం..

తాజాగా అల్లు అర్జున్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా రామాయణ సినిమాకి సంబంధించిన పోస్టర్ షేర్ చేస్తూ.. రామాయణ చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. రామాయణ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు మన సంస్కృతికి ప్రతిరూపం అని తెలిపారు. రామాయణం భారతీయ సినిమాల స్థాయిని మరో మెట్టు పైకి తీసుకువెళ్లే గొప్ప ప్రయత్నం. ఇలాంటి ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్న చిత్ర బృందం మొత్తానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన కథలను, మన సంస్కృతిని, మన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఇలాంటి ఒక గొప్ప ప్రయత్నానికి మనమంతా ఒక్కటిగా ఈ సినిమాకు మద్దతును తెలియచేద్దాం.. జైశ్రీరామ్ అంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు.

4000 కోట్ల బడ్జెట్ చిత్రం..

Advertisement

ఇలా రామాయణ ఆధారంగా ఒక గొప్ప చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందానికి బన్నీ అభినందనలు తెలుపుతూ ఈ పోస్ట్ చేయడంతో ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే సుమారు 4వేల కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా రెండు భాగాలు మాత్రమే కాదు మూడో భాగం కూడా ఉండబోతుందని తెలుస్తోంది.

Advertisement

ఇటీవల ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటుడు రణబీర్ కపూర్ టంగ్ స్లిప్ అవుతూ రామాయణ పార్ట్-3 గురించి లీక్ చేశారు. దీంతో రామాయణ పార్ట్ 3 కూడా ఉండబోతుందని స్పష్టమవతుంది. రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించగా సీత పాత్రలో సాయి పల్లవి(Sai Pallavi) నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రావణాసురుడిగా విలన్ పాత్రలో ప్రముఖ కన్నడ నటుడు పాన్ ఇండియా స్టార్ యష్(Yash) కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా, హీరో యశ్ సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే. మరి అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.

Also Read: లెజెండ్ సినిమాపై రాధిక ఆప్టే కామెంట్స్.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన ఎస్కేఎన్!

Related News

Illu Illalu Pillalu Today Episodes: నిజం చెప్పేసిన చందు.. వల్లికి అన్యాయం.. భాగ్యం సవాల్..

Brahmamudi Serial Today Episode November 3rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విష్ చేసిన రాజు 

మమిత ఇంత షాక్ ఇచ్చిందేంటి..? అదంతా నిజం కాదా..?

Monday TV Movies : మండే మూవీ మస్తీ.. డోంట్ మిస్…

Brahmamudi Serial Today Episode October 30th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖ ,ఇందుకు వేరే వాడితో పెళ్లి చేస్తుందా..?  

Intinti Ramayanam Pallavi : ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్న పల్లవి.. బాబోయ్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. కమల్ ప్రేమలో పడతాడా..? పార్వతికి టెన్షన్..

Big Stories

Advertisement
×