Illu Illalu Pillalu Today Episode November 4th: అయితే అప్పుడే సడన్గా భాగ్యం ఎంట్రీ ఇచ్చి వాడి కాళ్లు పట్టుకున్నావ్ ఏంటి వాడికి దుర్మార్గుడు అంటూ అనడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా అంత పెద్ద మనిషిని పట్టుకొని దుర్మార్గుడు అంటావేంటి అని అంటారు. అయితే అప్పుడే రామరాజు కాలర్ పట్టుకుని నా కూతురు జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూసావు నీకు కొంచెం కూడా బుద్ధి లేదా అని అడుగుతుంది. అయితే నేనేం చేశాను అని అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. నా కూతురికి విడాకులు పంపించి ఇంకొక పెళ్లి చెయ్యాలని చూస్తున్నావా అసలు నువ్వు ఏం పెద్దమనిషివి? నువ్వు అసలు మనిషివేనా అని భాగ్యం కడిగి పడేస్తుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.కానీ ఈ చందు మాత్రం విడాకులు నోటీసులు పంపించాను అని ఒప్పుకోవడంతో రామరాజు చందు ని కొడతాడు ఆ తర్వాత అందరూ కూడా వల్లిని చూసి జాలి పడతారు..
వల్లి గురించి అందరూ మాట్లాడుతూ ఉండగా భాగ్యం నా కూతురు జీవితాన్ని ఈ రామరాజు నాశనం చేస్తున్నాడు. నా కూతురుకి అన్యాయం చేస్తున్నారు ఇంత పెద్ద మనిషి మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నారు అని భాగ్యం కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన కూతురు జీవితం నాశనం అయిపోతుంది అని బాధపడిపోతుంది. ఇక చందు ఆపండి మీ నాటకాలు అని అంటాడు ఎందుకురా ఇలా చేసావు ఏమైందిరా అని చందు ని అడుగుతాడు రామరాజు. నన్ను ఎంతగా ఇబ్బంది పెట్టిన సరే.. నేను అసలు బాధపడలేదు మా అమ్మని మా నాన్నని ఇబ్బంది పెట్టారు అందుకే ఈ వల్లితో నేను కాపురం చేయాలి అనుకోవడం లేదు వదిలేస్తున్నాను అని చందు అంటాడు కానీ అందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు.
చందు తనకి శ్రీవల్లి వద్దు అని చెప్పగానే తను ఒక్కసారిగా బాధపడిపోయి కళ్ళు తిరిగే కింద పడిపోతుంది. శ్రీవల్లి ఏమైంది అమ్మడు నా కూతురికి ఏదో అయిపోయింది నా కూతుర్నే కాపాడండి అని భాగ్యం కన్నీళ్లు పెట్టుకుంటుంది.. అయితే శ్రీవల్లి లేచిన తర్వాత బావ నన్ను నిన్ను భార్యగా వద్దు అని అనుకుంటే పర్వాలేదు. నీ భార్య స్థానం మాత్రమే నాకు ఇవ్వు నీకు దూరంగానే ఉంటాను కానీ నాకు మాత్రం విడాకులు ఇవ్వద్దు బావ అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. మీ ఇంట్లో పనిమనిషి లాగానే ఉంటాను బావ నాకు మాత్రం విడాకులు ఇవ్వద్దు బావా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. అయితే ఈ సీను అందరినీ కంటతడి పెట్టించేస్తుంది.. కాని చందు మాత్రం ఆపు నీ నాటకాలు అని వెళ్ళిపోతాడు.
రామరాజు తన కోడలు తన ఇంటి నుంచి వెళ్ళిపోయే పరిస్థితిని కొడుకు తీసుకొని వచ్చాడు అలాగే పది మందిలో కాలర్ పట్టుకుని ఆ భాగ్యం ఇలా అడిగింది అని చాలా బాధపడిపోతూ ఉంటాడు. భాగ్యం మాటల్ని తలుచుకొని బాధపడిపోతూ ఉంటాడు రామరాజు. అయితే అప్పుడు అక్కడికి వచ్చినా వేదవతి మాత్రం ఆ భాగ్యం మీ నాన్న ముందు మాట్లాడడానికి భయపడేది. కానీ ఇప్పుడు మీ నాన్న కాలర్ పట్టుకుని మాట్లాడుతుందా అని సీరియస్ అవుతుంది.. కానీ రామరాజు మాత్రం వీడివల్లే నా పరువు పోయింది అని బాధపడిపోతూ ఉంటాడు. అయితే వీడు నా మాట కూడా వినకుండా ఇదంతా చేశాడు కాబట్టి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదని బాధ పడిపోతూ ఉంటాడు…
ఇది నా జీవితం నానా నా జీవితాన్ని నేను చూసుకోవడం కూడా తప్పేనా ఏం మాట్లాడుతున్నారు నాన్న అని చందు అంటాడు. పెద్దోడా ఇన్ని రోజులు నువ్వు నాన్న మాట జవదాటకుండా ఉన్నావు. కానీ ఇప్పుడు నువ్వు మాట మారుస్తున్నావో నిజంగా నువ్వు గ్రేట్ రా పెళ్లయిన తర్వాత కూడా 30ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆయన మాటే వినాలి అని ఆయన అనుకుంటున్నాడు అని సాగర్ అనగానే రామరాజు సీరియస్ అవుతాడు.. నీలాగా అవన్నీ తండ్రి మాట వినకుండా చేస్తున్నావా అని సీరియస్ అవుతాడు. మీరంతా గమ్మున ఉండండి ఏం కాదు ఏం చేయాలనుకుంటే అది చేద్దామని ధీరజ్ అంటాడు..
శ్రీవల్లి తన భర్త విడాకులు ఇస్తాను అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని బాధపడిపోతూ ఉంటుంది. తనని చూసినా తన తండ్రి ఆనందరావు వచ్చి ఏం తమ్ముడు బాధపడుతున్నావు బాధను మర్చిపోయే ప్రయత్నం చెయ్యు అని ఎంత చెప్తున్నా సరే.. అసలు వినకుండా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయితే భాగ్య మాత్రం నీ చావు నువ్వు చావు నీ చేతులారా నువ్వే ఇదంతా చేసుకున్నావు అని అంటుంది ఇక శ్రీవల్లి బాధ పడిపోతూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :దీపిక ఒక్క నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?