E-Paper
Advertisement

మమిత ఇంత షాక్ ఇచ్చిందేంటి..? అదంతా నిజం కాదా..?

మమిత ఇంత షాక్ ఇచ్చిందేంటి..? అదంతా నిజం కాదా..?
Advertisement

Mamitha Baiju : మలయాళ ముద్దుగుమ్మ మమత బైజు అనే పేరు వినగానే టక్కున గుర్తుకు వచ్చే సినిమా ప్రేమలు.. తన క్యూట్ అందంతో కుర్రకారుని ఒక్క సినిమాతో పడగొట్టేసింది. ఆ మూవీ ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలుసు. అయితే మొదటి సినిమా తనకి భారీ విషయాన్ని అందించడంతో ఆ తర్వాత ఆమెకు స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలు కూడా దక్కాయి. ఒకటి రెండు సినిమాలతోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు అది మమిత బైజుకే సాధ్యం.. అయితే ఇటీవల వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తన గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ని రీవిల్ చేసింది.. అది విన్న అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు.. మరి మమిత గురించి బయటపడ్డ రహస్యం ఏంటి అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

మమిత అసలు పేరెంటంటే..?

మలయాళం ముద్దుగుమ్మ మమిత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె నటించిన మొదటి సినిమా ప్రేమలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ని అందుకుంది. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే ఈమె అసలు పేరు గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. మరి ఈ ముద్దుగుమ్మ అసలు పేరు ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. నిజానికి మమిత అసలు పేరు నమిత అట.. అయితే బర్త్ సర్టిఫికెట్ నమోదు చేసే సమయంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల ‘నమిత’ కాస్తా ‘మమిత’గా ముద్రపడింది.. అయితే ఆ విషయాన్ని ఐదారుల వరకు ఆమె కుటుంబ సభ్యులు కూడా చూడకపోవడం విచిత్రం. అలా నమిత కాస్త మమిత అయ్యింది. ఇక అప్పటి నుంచి అదే పేరు ఆమెకు కంటిన్యూ అవుతుంది అలా ఆమె పేరు మారింది అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా కూడా రెండు పేర్లు బాగానే ఉండడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

మమిత సినిమాల విషయానికొస్తే..

Advertisement

2024లో విడుదలైన మలయాళ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ప్రేమలు’ మమిత కెరీర్‌కు ఊహించని బ్రేక్ ఇచ్చింది.. ఈ సినిమాతో ఒక్కసారిగా యూత్ కలల రాణిగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.. ఒక్క సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తుంది. 2025లో వచ్చిన ‘డ్యూడ్’, ఆపై ‘ జన నాయగన్ ‘, ‘ విశ్వనాథ్ అండ్ సన్స్ ‘, ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ వంటి వరుస చిత్రాలతో భారీ విజయాలను ఖాతాలో వేసుకుంది. అంతే కాదు ఆమె నటించినా అన్ని సినిమాలు కూడా దాదాపు 1,000 కోట్లకు పైగా వసూళ్లని అందుకున్నాయి. ఇకమీదట ఎలాంటి కథలతో ఈమె ప్రేక్షకులను అలరిస్తుందో అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.. ఇటీవలే విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమాలో నటించిన ఈ అమ్మడు ఆ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు మరో తెలుగు ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఆమె సైన్ చేసిన సినిమాలు గురించి ప్రకటించే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది..

Also Read :అరియానాకు పెళ్లి అయ్యిందా..? వీడియోతో ట్విస్ట్ ఇచ్చిందిగా సామి..

Related News

Monday TV Movies : మండే మూవీ మస్తీ.. డోంట్ మిస్…

Brahmamudi Serial Today Episode October 30th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖ ,ఇందుకు వేరే వాడితో పెళ్లి చేస్తుందా..?  

Intinti Ramayanam Pallavi : ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్న పల్లవి.. బాబోయ్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. కమల్ ప్రేమలో పడతాడా..? పార్వతికి టెన్షన్..

ఇంజినీర్ జాబ్ మానేసి రాపిడో డ్రైవర్ పనికి.. ఇప్పుడు నెలకు రూ.1.2 లక్ష ఆదాయం

Karthika Deepam 2 Serial Today Episode October 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: వంట మనిషిగా సుమిత్ర – మాలినికి దడ పుట్టించిన జ్యోత్స్న

రాజంపేటలో విచిత్ర దొంగతనం.. గాలిలో తేలుతూ వచ్చి రూ. 35 వేలు దోచేసిన లూటీ మాస్టర్!

Big Stories

Advertisement
×