Brahmamudi serial today Episode: రాజు బైక్ స్టార్ట్ కాకుండా సైలెంన్సర్‌లో తన కర్చీప్ పెట్టానని అది ఎప్పటికీ స్టార్ట్ కాదని ప్రశాంత్ చెప్తాడు. ఇందు షాక్ అవుతుంది. ఇప్పటికే చాలా గరం మీద ఉన్నాడు నువ్వు ఏం చేసినా తిడతాడు అని ఇందు చెబితే నా ప్రయత్నం నేను చేస్తాను అంటూ రాజు దగ్గరకు వెళ్తాడు ప్రశాంత్.. మేడం కారులో వెళ్తున్నారు మేడంతో పాటు వెళ్లండి అంటాడు ప్రశాంత్.. ఏంట్రా ఓవరాక్షన్ చేస్తున్నావు అంటూ రాజు తిడితే.. అయ్యో మీరు ఇచ్చిన షాక్ ఇంకా నా బుగ్గల మీద గుర్తులుగా ఉన్నాయి అంటూనే మేడం సార్‌ను డ్రాప్ చేస్తారా..? అని అడిగితే.. ఇందు నాకేం ప్రాబ్లెం లేదు అంటుంది. రాజు తిడుతుంటే.. కన్వీన్స్ చేసి రాజు, ఇందులో కారులో వెళ్లేలా చేస్తాడు ప్రశాంత్.
రాజు కారులో వెళ్తుంటాడు. ఇందు ఎన్ని రకాలుగా మాట్లాడాలని చూసిన రాజు మౌనంగా ఉంటాడు. త్వరగా ఇంటికి వెళ్లాలని సంతకం చేయగానే.. ఇంటికి వస్తానని నాన్నకు మాటిచ్చాను అంటాడు. ఇందు బాధపడుతుంది. ఇల్లు వచ్చాక రాజు దిగిపోతుంటే.. ఇందు ఆపేస్తుంది. ఎమోషనల్ అవుతుంది. ఏడుస్తుంది. రాజు కన్నీళ్లు పెట్టుకుంటూ నేను వెళ్తున్నాను అంటే.. రాజు చివరిగా నాకేమైనా చెప్పాలా..? అని ఇందు అడిగితే.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటాడు. ఇందు ఏడుస్తూ.. అక్కడి నుంచి వెళ్లిపోతుంటే చలపతి కూరగాయలు తీసుకుని వస్తాడు. ఇందును చూసి కోపంగా మళ్లీ ఎందుకు వచ్చావమ్మా అని అడిగితే.. మీతో కొంచెం మాట్లాడాలి అంకుల్ అంటుంది ఇందు. దేని గురించి అని చలపతి అడిగితే చెప్తాను అంకుల్ అని ఇందు చెబితే.. కూరగాయలు లోపల పెట్టేసి వస్తాను ఉండు అంటూ చలపతి వెళ్లిపోతాడు.
తిరిగి వచ్చిన చలపతితో ఇందు ఎమోషనల్ అవుతుంది. రాజు ఆ ఇంటి వారసుడు నా బావ అని మీకు తెలుసు. ఆరోజు మీరు రాజును తీసుకెళ్లిపోతున్నా నేను ఏమీ అనలేదు. తన మరదలుగా మాట్లాడే హక్కు ఉన్నా మీకు మాట ఇచ్చినందుకు మౌనంగా ఉన్నాను. నా కళ్ల ముందే బావను మీరు తీసుకెళ్తున్నా.. గుండెల్లో బాధ ఉన్నా మీకిచ్చిన మాట కోసం మౌనంగా ఉన్నాను అంటూ ఎమోషనల్ అవుతుంది. అందుకు చలపతి నువ్వన్నది నిజమే వాడు ఆ ఇంటి బిడ్డే.. కానీ కంటేనే కోడుకు అవుతాడా..? పాతికేళ్లు ప్రాణం పెట్టి పెంచాను.
అలాంటప్పుడు వాడి మీద నాకు ఆ మాత్రం అధికారం లేదా అమ్మా ఎవరు నమ్మినా నమ్మకపోయినా.. ఒప్పనుకున్నా ఒప్పుకోకపోయినా నేనే వాడికి తండ్రిని .. వాడు నా బిడ్డే.. అంటూ చలపతి చెబితే.. రాజు గురించి ఇందు ఎమోషనల్ అవుతుంది. రాజు తన జీవితాన్ని మార్చేశాడని రేఖ ఆంటీ నుంచి తమను కాపాడింది రాజేనని డబ్బు కోసం వచ్చిన రాజు తన కోసం ఎన్నో అవమానాలు పడ్డాడు.. నాకోసం ప్రపంచాన్నే ఎదిరించి నాకు అండగా నిలబడిపోయేంత.. నాకు తెలియకుండానే తన ప్రేమలో పడిపోయాను. మా ప్రేమకు మీరు ఆంగీకరిస్తాన్న ఆశతో వెళ్లిపోతున్నాను అంకుల్ అంటూ ఏడుస్తూనే వెళ్లిపోతుంది ఇందు.
ఇంట్లో పెళ్లి జరిపించడానికి పంతులు రెడీ చేస్తుంటాడు. ఐశ్వర్యను పిలిచి ఏవేవో తక్కువ ఉన్నాయని తీసుకురమ్మని చెబితే.. ఐశ్వర్య కోప్పడుతుంది. నేనెవరో తెలుసా..? ఓ కంపెనీ చైర్మన్‌ను అంటూ పంతులును తిడుతుంది. లక్కీ వచ్చి పంతులుగో గొడవ వద్దని ప్రతి చోట నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఇలా చేయాలా..? అంటాడు. ఐశ్వర్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
అపర్ణ పెళ్లి ఆపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కావడం లేదని బాధపడుతుంటే.. సుభాష్ వచ్చి ఒకసారి రాజుకు కాల్ చేయ్ పెళ్లి గురించి చెప్పు అంటాడు. అపర్ణ కాల్ చేస్తుంది. రాజు మాత్రం లిఫ్ట్ చేయడు. అపర్ణ బాధపడుతుంది. పైన ఇందును పెళ్లికూతురుగా రెడీ చేస్తుంటారు రేఖ, బ్రమరాంబ. ఇందు హ్యాపీగా రెడీ అవుతుంటే.. భ్రమరాంబ అనుమానంగా దీనికి కనీసం రాజు దూరం అవుతున్నాడన్న భయం కూడా లేదు నాకు ఏదో అనుమానంగా ఉంది అంటుంది. అదేం లేదని రేఖ అంటుంది. ఇంతలో ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్ అయిపోతుంది.