BigTV English

China pushed America : ఆ విషయంలో అమెరికాను వెనక్కి తోసిన చైనా..

China pushed America : ఆ విషయంలో అమెరికాను వెనక్కి తోసిన చైనా..

అడ్వాన్స్ టెక్నాలజీలను తయారు చేసే విషయంలో ప్రపంచ దేశాల మధ్య పోటీని ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. నువ్వా, నేనా అనుకుంటూ దేశాలన్నీ.. ప్రజలు ఆశ్చర్యపోయే టెక్నాలజీలను మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే చైనా అభివృద్ధి మాత్రం ఇతర దేశాలను భయపెట్టే విధంగా ఉంది. అభివృద్ధికి ఎంతో ముందు ఉండే అమెరికా సైతం చైనా వేస్తున్న ఎత్తులకు భయపడుతోంది.


సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో చైనాతో పోటీపడాలని ప్రయత్నిస్తున్న దేశాలన్ని ఓడిపోతున్నాయి. 44 టెక్నాలజీలలో చైనానే 37 టెక్నాలజీల విషయంలో లీడ్‌లో ఉందని తాజాగా ఓ సర్వేలో తేలింది. ఎలక్ట్రిక్ బ్యాటరీలు, హైపర్‌సోనిక్స్, రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్స్, 5జీ, 6జీ సేవలు.. ఇలాంటి ఎన్నో విభాగాల్లో చైనా ఇతర దేశాలకంటే ఎంతో ముందంజలో ఉంది. మిగిలిన ఏడు విభాగాల్లో అమెరికా ముందంజలో ఉన్నట్టుగా తేలింది.

వ్యాక్సిన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, స్పేస్ సిస్టమ్స్ విభాగాల్లో చైనా.. అమెరికాను దాటి ముందుకు వెళ్లలేకపోయింది. అందుకే ప్రస్తుతం చైనా.. స్పేస్ టెక్నాలజీ విషయంలో అద్భుతాలు సృష్టించాలని నిర్ణయించుకుంది. ఆ విభాగంలో ఎన్నో కొత్త పరిశోధనలకు కూడా శ్రీకారం చుట్టింది. అమెరికా, చైనా మధ్య జరుగుతున్న పోటీని ఇంటర్నేషనల్ మీడియా ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది. అందుకే టెక్నాలజీల విషయంలో జరిగిన ఈ సర్వే.. పూర్తిగా ఖచ్చితమైనదని నిపుణులు నమ్ముతున్నారు.


ప్రపంచంలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ సూపర్ పవర్‌గా ఎదగాలని చైనా సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నో టెక్నాలజీలకు సంబంధించి పరిశోధనలు చేసే విషయంలో చైనా ఎన్నో రిస్క్‌లు చేయడానికి కూడా వెనకాడడం లేదని రిపోర్ట్ చెప్తోంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి టాప్ 10 రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్ చైనాకు సంబంధించినవే అని రిపోర్టులో తేలింది. దానికి సంబంధించి రెండో స్థానాన్ని అమెరికా దక్కించుకుంది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×