BigTV English

Photos Of Mars : మార్స్ గురించి స్పష్టంగా తెలియజేసే ఫోటోలు బయటికి..

Photos Of Mars : మార్స్ గురించి స్పష్టంగా తెలియజేసే ఫోటోలు బయటికి..
Photos Of Mars


Photos Of Mars : నాసాకు చెందిన కొందరు శాస్త్రవేత్తల టీమ్.. గత కొన్ని రోజులుగా మార్స్‌పై పరిశోధనలు చేయడంలో నిమగ్నమయి ఉన్నారు. అందుకోసమే ప్రత్యేకంగా పలు మెషీన్లను తయారు చేసి మార్స్‌పై పంపించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే నాసా తయారు చేసి మార్స్‌పైకి పంపించిన మావెన్ (మార్స్ అట్మాస్పియర్ అండ్ వాలటైల్ ఎవల్యూషన్) మెషీన్ సక్సెస్‌ఫుల్‌గా తన పనిని కొనసాగిస్తోంది. తాజాగా మార్స్‌కు సంబంధించి మావెన్ విడుదల చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

సూర్యుడి చుట్టూ మార్స్ తిరుగుతున్న సమయంలో దానికి సంబంధించిన రెండు అల్ట్రావైలెట్ ఇమేజ్‌లను మావెన్ క్యాప్చర్ చేసింది. అల్ట్రావైలెట్ వేవ్‌లెన్త్ ద్వారా మార్స్‌ను చూడగలిగితే.. అక్కడ వాతావరణాన్ని, ఉష్ణోగ్రతను మరింత స్పష్టంగా స్టడీ చేసే అవకాశం దొరుకుతుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఇప్పటివరకు లేని విధంగా మార్స్ గురించి స్టడీ చేయడం కోసం ఈ అల్ట్రావైలెట్ ఇమేజెస్ పనిచేస్తాయని చెప్తున్నారు. మావెన్‌కు సంబంధించిన ఇమేజింగ్ అల్ట్రావైలెట్ స్పెక్ట్రోగ్రాఫ్ (ఐయూవీఎస్) సాయంతో ఈ ఫోటోలు బయటికొచ్చాయి.


ఈ వేవ్‌లెన్త్స్ అనేవి మనిషి కంటికి కనిపించేలా చేయడం కోసం, స్టడీకి సులువుగా ఉండడం కోసం కలర్స్‌ను మార్చవలసి వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా రెడ్, గ్రీన్, బ్లూ లాంటి బ్రైట్ కలర్స్‌తో ఈ అల్ట్రావైలెట్ వేవ్‌లెన్త్‌ను మార్చాలన్నారు. మామూలుగా ఈ కలర్ స్కీమ్‌లో వాతావరణం అనేది పర్పుల్ కలర్‌లో కనిపిస్తుందని చెప్తున్నారు. ఇక క్లౌడ్స్ లాంటి తెలుపు లేదా బ్లూ కలర్‌లో కనిపిస్తాయని అంటున్నారు. నేల అనేది గ్రీన్ కలర్‌లో ఉంటుందన్నారు. ఇలా కలర్స్‌తో డివైడ్ చేయడం వల్ల వాటి గురించి స్టడీ చేయడం సులభంగా ఉంటుందని తెలిపారు.

మావెన్.. మార్స్‌కు సంబంధించిన మొదటి ఫోటోను 2022 జులైలో తీసిందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. అంటే ఎండాకాలంలో మార్స్.. సూర్యుడికి చాలా దగ్గరగా చేరుకున్న సమయంలో ఫోటోలు తీసిందన్నారు. ఎండాకాలంలో భూమిపై ఎలాంటి మార్పులు జరుగుతాయో మార్స్‌పై కూడా అలాంటి మార్పులే జరుగుతాయని అన్నారు. ఇక మార్స్‌కు సంబంధించిన రెండో ఫోటో 2023 జనవరిలో తీసినట్టుగా బయటపెట్టారు. మావెన్ మెషీన్ 2013 నవంబర్‌లో లాంచ్ అవ్వగా.. 2014 సెప్టెంబర్‌లో మార్స్‌లోకి చేరుకున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తుచేసుకున్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×