BigTV English

Climate Change : వాతావరణ మార్పుల వల్ల వరద సూచన..

Climate Change : వాతావరణ మార్పుల వల్ల వరద సూచన..
Climate Change

Climate Change : మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ప్రకృతిలో సహజంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులు చాలావరకు మానవాలి ఇబ్బంది కలిగించే విధంగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మార్పులు ప్రాణహానికి కూడా దారితీస్తున్నాయి. అంతే కాకుండా ఇవి ప్రకృత్తి విపత్తులకు కూడా దారితీసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. తాజాగా కోలకత్తా, చెన్నైలో ఉన్న సముద్రాల విషయంలో వారు ఓ పెద్ద మార్పును గమనించారు.


చెన్నై, కోలకత్తా ప్రాంతాల్లో ఉన్న సముద్రాల నీటిమట్టం సాధారణంగా ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉందని, ఇది ఎప్పటికప్పుడు పెరుగుతూపోతోందని పర్యావరణవేత్తలు గమనించారు. ఇది ఏసియాలోని మేజర్ సిటీలతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా ప్రమాదకరమని వారు భావిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల సముద్రాల నీటిమట్టం పెరగడం గురించి ఇప్పటికే ఎంతోమంది ఫారిన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.

గాలి కాలుష్యం వల్ల, గాలిలో కలుస్తున్న హానికారక రసాయనల వల్లే సముద్రాల నీటిమట్టం పెరుగుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతే కాకుండా వీటిని అదుపు చేయకపోతే.. 2100 లోపు చెన్నై, కోలకత్తా, యాన్గాన్, బ్యాంకాక్, మనీలా వంటి ప్రాంతాల్లో ఉన్న సముద్రాల వల్ల ప్రజలకు భారీ నష్టం జరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. సముద్రాల నీటిమట్టం పెరగడానికి గాలి కాలుష్యమే కారణమయినా.. ఇది తీవ్రస్థాయిలో వరదలు వచ్చే పరిస్థితులకు కూడా దారితీస్తాయని తెలుస్తోంది.


2100 లోపు మనీలాలో కనీసం 18 సార్లు వరదలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒకవేళ పరిస్థితి మరీ దారుణంగా మారితే.. 96 సార్లు కూడా వరదలు వచ్చే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. సముద్రాల వాతావరణం, భూ వాతావరణంలో మార్పులు.. ఈ రెండు కలిసి ఎన్నో దుర్ఘటనలకు దారితీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల కేవలం ఈ ప్రాంతాల్లోనే కాకుండా ఎన్నో ఇతర ప్రాంతాల్లోని సముద్రాల నీటిమట్టంలో కూడా దాదాపు 50 శాతం మార్పు ఉండవచ్చని వారు అంచనా వేస్తున్నారు.

సముద్రాల నీటిమట్టం పెరగడం వల్ల వాతావరణం వెచ్చగా మారుతుంది. దీని కారణంగా సముద్రాల చుట్టుపక్కల ఉన్న మంచు కూడా కరిగి నీటిలో కలిసి మరింత నీటిమట్టాన్ని పెంచుతుంది. అందుకే ముందుగా భూ వాతావరణం అదుపులోకి రావాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్‌ను అదుపులోకి తీసుకురావడానికి శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ ప్రయత్నాలు త్వరలో సక్సెస్ అవ్వలేకపోతే.. భారీ నష్టం జరుగుతుందని వారు భావిస్తున్నారు. ఈ విషయంలో ప్రజలు కూడా తమవంతు సాయం చేయాలని వారు సూచిస్తున్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×